ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) అనేది మన పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్త అవగాహన, కార్యాచరణను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన రోజు. ప్రపంచ పర్యావరణ దినో త్సవం సానుకూల మార్పును ప్రేరేపించడానికి ప్రపంచ వేదిక. 150 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రజలు ఈ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొంటారు. పర్యావరణ రక్షణ చర్యలు చేపట్టడానికి, మరింత స్థిరమైన ప్రపంచాన్ని ఏర్పరచడానికి ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు జరుపుకునే కార్యక్రమం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణంపై దృష్టి సారించిన అతి పెద్ద అంతర్జాతీయ కార్యక్రమం.
ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారం ”మన భూమి” అనే నినాదంతో…భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకునే శక్తి, పద్ధతులపై దృష్టి సారిస్తుంది. మన భవిష్యత్తు, మన తరం, భూమి పునరుద్ధరణ ప్రధానాంశాలు. సౌదీ అరేబియా 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ వేడుకలను నిర్వహించనుంది.
వాతావరణ మార్పు, పర్యావరణ వ్యవస్థ నష్టం, భూమి ఎడారీకరణ వంటి తీవ్రమైన పరిణామాలతో మానవ-ప్రేరిత పర్యావరణ నష్టం పెరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం, భూమి మరియు ప్రకృతిని వాటి సహజ స్థితికి పునరుద్ధరించడం ప్రస్తుత తరంగా మన కర్తవ్యం. ఉత్పాదక భూమిని రక్షించడానికి, పునరుద్ధరించడానికి జీవనోపాధిని పెంచడానికి, ఆహార భద్రతకు మద్దతు ఇవ్వడానికి, పెంచడానికి నిర్దేశించబడింది. మన భూమి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఎడారీకరణ, భూమి క్షీణత, కరువు అనేది మన కాలంలోని అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లలో ఒకటి.
మన దేశంలో కూడా ”మన భూమి” అనే నినాదంతో భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకునే శక్తిపై దృష్టి సారించాలి. ప్రభుత్వాలు ఆ వైపు కార్యాచరణను రూపొందించి కచ్చితంగా అమలు చేయాలి. పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రేమికులు, సైన్సు సంస్థలు ప్రచారం విస్తృతంగా నిర్వహించాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా యువతను ఈ కార్యక్రమాల్లో ఇముడ్చుకుని కలసి పనిచేయాలి. అంతర్జాతీయ నిబంధనలు ప్రభుత్వాలు పాటించేలా ప్రజా ఉద్యమం దిశా నిర్దేశం చేయాలి. అన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, వ్యక్తులు ఒక ఉద్యమంలా ఐక్యంగా పనిచేయాలి.
– కె.వి.వి. సత్యనారాయణ,
రాష్ట్ర పర్యావరణ కమిటీ కన్వీనర్, సెల్ : 8500004953








కామెంట్‌లు (0)