test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసుపత్రి బెడ్‌ పై నుండి పండు మాస్టర్ వీడియో రిలీజ్

2 రోజుల క్రితం

Video of Pandu Master released from the hospital bed.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 01:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ : తెలుగులో డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్.. ఇటీవల విశాఖలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. మాస్టర్ రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతానికి పండు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్పత్రి బెడ్‌పై నుంచే పండు మాస్టర్ వీడియో రిలీజ్ చేశారు. యాక్సిడెంట్ ఎలా జరిగింది ? తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరించారు. ‘తగరపువలసలో ఈవెంట్ చేసుకుని బయలుదేరాం. కారులో వస్తుండగా నాకు వాంతి వస్తున్నట్లు అనిపించింది. దీంతో ఆనందపురం దాటిన తర్వాత ఓ చోట ఆగాను. బయటకు దిగి కారు ముందుకెళ్లి వాంతి చేస్తుండగా కోళ్ల ఫారమ్ వ్యాన్ వచ్చి మా కారుని బలంగా ఢీ కొట్టింది. అప్పుడు మా కారు నాపై ఎక్కడంతో నా రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. అప్పుడు నేను అపస్మాకర స్థితిలో ఉండటంతో ఏం జరిగిందో తెలీదు’ అని ఈ వీడియోలో పండు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ నడుము కింది భాగంలో జాయింట్ కదిలిపోయింది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేశారు. రెండు కాళ్లకు కూడా సర్జరీలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం ఆరు నెలల విశ్రాంతి అవసరమని, తర్వాత మళ్లీ యధావిధిగా డ్యాన్స్ చేయవచ్చని వైద్య బృందం స్పష్టం చేశారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్