test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

4 గంటల క్రితం

abhaya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  •  మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందుతోన్న ‘అభ‌య‌’

  • పాన్ ఇండియా లెవ‌ల్లో 4 భాష‌ల్లో రిలీజ్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు యూస‌ఫ్ ముజామ్మిల్ సుర్తి ద‌ర్శ‌క‌త్వంలో యోగిత భోసాలె ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతోన్న మ‌హిళా సాధికారిక చిత్రం ‘అభ‌య‌’. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్, ఆర్‌.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మ‌రాఠీ, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ చూస్తుంటే మ‌హిళా సాధికారిత‌పై రూపొందుతోన్న ప‌వ‌ర్‌ఫుల్ ప్రాజెక్ట్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో ఇంకా మోహ‌న్ జోషి, గ‌ణేష్ యాద‌వ్‌, క‌మ‌లేష్ సావంత్‌, అనికేత్ కేల్‌క‌ర్‌, రోహిత్ కోక‌టి, ఉమేష్ బోల్కె, డా.సంజీవ్ కుమార్ పాటిల్‌, హ‌ర్ష్ నిక‌మ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా గ్రాండియెంటె ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ అధినేత‌, నిర్మాత డా.విమ‌ల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ ‘‘‘అభ‌య‌’ కేవలం సినిమా మాత్ర‌మే కాదు..స‌మాజానికి బ‌ల‌మైన సందేశం. ఈ మూవీ ద్వారా త‌ర‌త‌రాలుగా ఎంద‌రికో ప్రేర‌ణ‌గా నిలుస్తోన్న మ‌హిళ‌ల శ‌క్తి, ప‌ట్టుద‌ల‌ను సెబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా నాలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ రోజు పోస్ట‌ర్‌ను విడుదల చేయ‌టం ఆనందంగా ఉంది. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

RDG ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత‌, నిర్మాత శ్రీ రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ ‘‘‘అభయ’ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌టం ఆనందంగా ఉంది. ఈ మూవీ ఒక అర్థవంతమైన సందేశాన్ని అందించడమే కాకుండా, బలమైన కథనం, అద్భుతమైన నటీన‌టుల‌తో రూపొందింది. ఈ ప్రేరణాత్మక సినిమాటిక్ అనుభవాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్