test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రణబాలి’ 100 రోజుల షూటింగ్‌ పూర్తి

1 రోజు క్రితం

vijay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం వంద రోజుల షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంతో, 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల గండికోటలో వారం రోజుల పాటు షెడ్యూల్ నిర్వహించారు. విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటిదాకా 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్