test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

`జన నాయగన్’ విడుదలపై దర్శకుని కీలక వ్యాఖ్యలు

31 మే, 2026

jana-nayagan-movie-release
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : `జన నాయగన్’ సినిమా విడుదలపై ఆ సినిమా దర్శకుడు హెచ్.వినోద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా మన చేతుల్లో ఉండదని అన్నారు. ఈ సినిమాకి సంబంధించిన నిజాల గురించి మాట్లాడేందుకు తనకు ధైర్యం లేదని, ఒక వేళ ధైర్యం చేసి మాట్లాడినా టెలికాస్ట్ చేసే ధైర్యం మీకు ఉండదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ సినిమా విడుదల వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సి వుంది. అయితే సెన్సార్‌ సర్టిఫికేట్ విషయంలో వివాదం కోర్టుకు చేరింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటైన రివైజింగ్‌ కమిటీ ఈ మూవీని చూసి, రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదని నిర్మాత వెంకట్‌ కె. నారాయణ ఇటీవల తెలిపారు. అయితే విజయ్ సిఎం అయిన వెటనే సినిమా విడుదలవుతుందని అభిమానులు భావించారు కానీ .. ఈ వ్యవహరం ఇప్పటికీ తేలకపోవడంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్