తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విజయ్ ని నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్ను కలిసిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. “తమిళనాడు సీఎం, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను” అని ఆ పోస్ట్ కింద రాశారు. తమిళనాడు అభ్యున్నతి కోసం ఆయన కంటున్న ఎన్నో కలలను ఈ సందర్భంగా తనతో పంచుకున్నారని, భేటీ సమయంలో విజయ్ చూపించిన వినయం, ఆప్యాయత తనను ఎంతో గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. వివిధ రకాల అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటున్న కోలీవుడ్‌కు ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం ఎంతో అవసరమని తాను విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ, ఆరు ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎం విజయ్‌కు అందించినట్లు కూడా తెలిపారు. తాజా భేటీలో కమల్ హాసన్, సీఎం విజయ్‌కు ప్రముఖ చరిత్రకారుడు Ramachandra Guha రాసిన Gandhi Before India పుస్తకాన్ని బహుమతిగా అందించారు.
సిఎం విజయ్ ను కలిసిన కమల్ హాసన్
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)