test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు ?

5 రోజుల క్రితం

deepika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 06:15 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

61. సూర్యుని నుండి భూమికి కాంతి చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది?
A) 8 నిమిషాలు20 సెకన్లు B) 5 నిమిషాలు
C) 10 నిమిషాలు D) 12 నిమిషాలు
62. ఒక వస్తువు భూమ్యాకర్షణను అధిగమించడానికి అవసరమైన కనీస వేగం ఎంత?
A) 7.9 km/s B) 9.8 km/s
C) 11.2 km/s D) 15 km/s
63.ట్రాన్స్‌ఫార్మర్ పనిచేసే సూత్రం
A) విద్యుద్విశ్లేషణ B) పరస్పర ప్రేరణ
C) ఓమ్ నియమం D)కూలంబ్ నియమం
64. ఒక రాయి మరియు ఒక ఈకను శూన్యంలో ఒకే ఎత్తు నుండి వదిలితే
A)రాయి ముందుగా నేలను చేరుతుంది
B)ఈక ముందుగా నేలను చేరుతుంది
C)రెండూ ఒకేసారి నేలను చేరుతాయి D)చెప్పలేము
65. ఒక వస్తువు వేగం రెట్టింపు అయితే దాని గతిశక్తి ఎన్ని రెట్లు అవుతుంది ?
A) రెట్టింపు B )నాలుగు రెట్లు
C) ఎనిమిది రెట్లు D) మారదు
66. కింది వాటిలో సదిశ రాశి ఏది?
A) దూరం(Distance) B) స్పీడ్(Speed)
C) పని(Work) D) వేగo (Velocity)
67. విద్యుత్ ప్రవాహం I,నిరోధంR అయితే ఉత్పన్నమైన ఉష్ణం దేనికి అనులోమంగా ఉంటుంది?
A) I B) R మాత్రమే C) I2R D) I/R
68. భూమిపై గురుత్వ త్వరణం (g)విలువ ఎంత?
A) 8.9 m/s2 B) 9.8 m/s2
C) 10.8 m/s2 D) 11.8 m/s2
69. కింది వాటిలో మంచి విద్యుత్ వాహకం ఏది?
A) రబ్బరు B)ప్లాస్టిక్ C) వెండి D)గాజు
70. కింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది?
A) బొగ్గు B) పెట్రోలియం
C) సహజ వాయువు D)సౌరశక్తి
71. కింది వాటిలో ఉష్ణానికి మంచి వాహకం ఏది?
A) చెక్క B) గాజు C) ప్లాస్టిక్ D) రాగి
72. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది?
A) జనరేటర్ B) ట్రాన్స్‌ఫార్మర్ C) మోటార్ D) బ్యాటరీ

73.వస్తువు బరువు అత్యల్పంగా ఉండే ప్రదేశం ఏది?
A) భూమధ్యరేఖ వద్ద B) ధ్రువాల వద్ద
C) సముద్ర మట్టం వద్ద D) పర్వత ప్రాంతంలో
74. శబ్దం యొక్క పిచ్ (Pitch)దేనిపై ఆధారపడి ఉంటుంది?
A) వ్యాప్తి (Amplitude) B) పౌనఃపున్యం(Frequency)
C) వేగం D) తరంగదైర్ఘ్యం
75.ఓమ్ నియమం ప్రకారం V =?
A) I/R B) IR C) R/I D) I²R
76. నీటి సాంద్రత అత్యధికంగా ఉండే ఉష్ణోగ్రత ఎంత?
A) 0°C B) 100°C C) 10°C D) 4°C
77. కింది వాటిలో అయస్కాంత పదార్థం ఏది?A)అల్యూమినియం B)ప్లాస్టిక్
C) ఇనుము D) చెక్క
78.అల్ట్రాసోనిక్ తరంగాల పౌనఃపున్యం
A) 20 Hz కంటే తక్కువ
B) 20 Hz – 20,000 Hz మధ్య
C) 20,000 Hz కంటే ఎక్కువ
D) 2000 Hz కంటే తక్కువ
79.సౌర ఘటకం (Solar Cell) ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది?
A) ఉష్ణ శక్తి B) కాంతి శక్తి
C) రసాయన శక్తి D) యాంత్రిక శక్తి
80. పరమాణు సంఖ్య (Atomic Number) దేనికి సమానం?
A) న్యూట్రాన్ల సంఖ్య B) ప్రోటాన్ల సంఖ్య
C)ఎలక్ట్రాన్లు+న్యూట్రాన్లు D) ద్రవ్యరాశి సంఖ్య
81. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు?
A) హోమీ భాభా B) విక్రమ్ సారాభాయి
C) అబ్దుల్ కలాం D) సి.వి.రామన్
82. ఉపగ్రహాలను ప్రయోగించే వాహనాన్ని ఏమంటారు?
A) రాకెట్ B) రోవర్ C) ల్యాండర్ D) డ్రోన్
83.రాకెట్ పనిచేసే సూత్రం ఏమిటి?
A) పాస్కల్ సూత్రం B) న్యూటన్ మూడవ నియమం
C)ఓమ్ సూత్రం D) బెర్నోలీ సిద్ధాంతం
84. భూమిపై వస్తువులు క్రిందికి పడటానికి కారణం ఏమిటి?
A) అయస్కాంత బలం B) ఘర్షణ బలం
C) గురుత్వాకర్షణ బలం D) విద్యుత్ బలం
85. చంద్రయాన్-1చంద్రునిపై ఏమి కనుగొంది?
A) బంగారం B) నీటి అణువులు C) జీవులుD) హీలియం
86. భూమి చుట్టూ తిరిగే కృత్రిమ వస్తువును ఏమంటారు?
A) ఉపగ్రహం B) గ్రహం C) నక్షత్రం D) ధూమకేతువు
87.INSAT ఉపగ్రహాలు ప్రధానంగా ఏ సేవలకు ఉపయోగపడతాయి?*A) వ్యవసాయం B) కమ్యూనికేషన్ C) గనులు *D) రవాణా
88. GPS వ్యవస్థ ప్రధాన ఉపయోగం ఏమిటి?
A) వంట B) స్థాన నిర్ధారణ C) వైద్యం D) విద్యుత్ ఉత్పత్తి
89. భూమి ఆకారం ఎలా ఉంటుంది?*A) సమతలం B) త్రిభుజం C).చతురస్రం D) గోళాకారం
90. హబు ల్ ఏ రకమైన పరికరం?
A) రాకెట్ B) ఉపగ్రహం C) అంతరిక్ష దూరదర్శిని
D) రోవర్
91. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?
A) భూమి సూర్యుని మధ్యలో వచ్చినప్పుడు
B) సూర్యుడు-భూమి మధ్యకు చంద్రుడు వచ్చినప్పుడు
C)సూర్యుడు చంద్రుని వెనుక ఉన్నప్పుడు
D) భూమి చంద్రుని వెనుక ఉన్నప్పుడు
92.చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుంది?
A) చంద్రుడు భూమి మధ్యలో ఉన్నప్పుడు
B)సూర్యుడు-చంద్రుడు మధ్య భూమి ఉన్నప్పుడు
C)సూర్యుడు భూమి మధ్యలో ఉన్నప్పుడు
D)చంద్రుడు సూర్యుని మధ్యలో ఉన్నప్పుడు
93. భూమి నీలంగా కనిపించడానికి కారణం ఏమిటి?
A) నీరు B) ఆకాశం
C) సముద్రాలు మరియు వాతావరణం D) మేఘాలు
94. సౌరవ్యవస్థ కేంద్రం ఏది?
A) చంద్రుడు B) భూమి C) సూర్యుడు D) గురుడు
95. అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది?
A) కుజుడు B) బుధుడు C) శుక్రుడు D) గురుడు
96.రెడ్ ప్లానెట్‌గా ప్రసిద్ధి చెందిన గ్రహం ఏది?A) శుక్రుడు B) కుజుడు C) గురుడు D) శని
97.శనిగ్రహాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి కారణమైన లక్షణం ఏమిటి?
A) నీరు B) ఉంగరాలు C) వేడి D) జీవులు
98. అద్దంలో ఏర్పడే ప్రతిబింబం ఎడమ-కుడి మారినట్లు కనిపించే లక్షణాన్ని ఏమంటారు?
A) వక్రీభవనం B) పరావర్తనం
C)పార్శ్వవిలోమం D)వ్యతికరణం
99. భారతదేశం యొక్క సూర్య అధ్యయన మిషన్ పేరు ఏమిటి?
A )చంద్రయాన్ B)ఆదిత్య-L1
C)మంగళయాన్ D) గగనయాన్
100.అంతరిక్షంలో మొట్టమొదటి మనిషి ఎవరు?
A)నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ B)యూరీ గగారిన్
C)రాకేష్ శర్మ D)ఎడ్విన్ ఆల్డ్రిన్
101.చంద్రునిపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి ఎవరు?
A)యూరీ గగారిన్ B)నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
C)ఆల్డ్రిన్ D)కల్పనా చావ్లా
102. ISRO రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట *ఏ రాష్ట్రంలో ఉంది?A)తెలంగాణB)తమిళనాడుC)ఆంధ్రప్రదేశ్D)కేరళ
103. భారతదేశపు మొదటి ప్రయోగ వాహనం ఏది?
A) PSLVB) GSLVC) SLV-3D) ASLV
104. SLV-3ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ఎవరు?
A)అబ్దుల్ కలాం B)విక్రమ్ సారాభాయి
C)సతీష్ ధావన్ D)హోమీ భాభా
105.రోవర్ ఉపయోగం ఏమిటి?*A)ఎగరడం B)ఉపగ్రహ ప్రయోగం*C)గ్రహ ఉపరితల పరిశోధన D)కాంతి ఉత్పత్తి
106.ఉల్కలు భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతాయి?
A) మంచుగా మారుతాయి B) దహనమవుతాయి
C) అదృశ్యమవుతాయి
D)నీటిగా మారుతాయి
107.అంతరిక్షంలో బరువు లేకపోవడం ఏమని పిలుస్తారు?
A) శూన్యత B)సూక్ష్మ గురుత్వం
C) అధిక పీడనం D) అయస్కాంతం
108. సూర్యుడు ఏ రకమైన ఖగోళ వస్తువు?
A) గ్రహం B) ఉపగ్రహం C) నక్షత్రం D) ధూమకేతువు
109. చంద్రునిపై వాతావరణం ఎందుకు లేదు?
A) నీరు లేదు B) గురుత్వాకర్షణ తక్కువ
C) కాంతి లేదు D) వేడి ఎక్కువ
110. భూమి వాతావరణంలో అత్యధికంగా
ఉన్న వాయువు?
A) ఆక్సిజన్ B) కార్బన్ డై ఆక్సైడ్
C) నైట్రోజన్ D)హైడ్రోజన్
111.కృత్రిమ ఉపగ్రహాల ప్రధాన ఉపయోగం కానిదేది?
A) వాతావరణ అంచనా
B) కమ్యూనికేషన్
C) వ్యవసాయం D) భూకంపం సృష్టించడం
112. చంద్రునిపై గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే?
A) సమానం B) ఎక్కువ C) తక్కువ D) రెండింతలు
113.కింది వాటిలో అదిశ రాశి ఏది?
A) బలం B)వేగం(Velocity) C) త్వరణం D) దూరం
114.గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమంటారు?
A) వలయం B) కక్ష్య C) దిక్సూచి D) రేఖ
115.అంతరిక్ష దుస్తులు ఎందుకు అవసరం?*A) అందంగా కనిపించడానికి B) చలినుంచి రక్షణకు*C) ఆక్సిజన్ మరియు రక్షణ కోసం D) వేడి కోసం
116.చంద్రయాన్-3విజయవంతంగా ఎక్కడ దిగింది?
A) చంద్రుని ఉత్తర ధ్రువం
B) చంద్రుని దక్షిణ ధ్రువం C) కుజుడు D) భూమి
117.అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలలో ప్రధానంగా ఉపయోగించే శక్తి వనరు ఏది?
A) బొగ్గు B) సౌరశక్తి C) పెట్రోలు D) డీజిల్
118.స్పేస్ స్టేషన్ ఉపయోగం ఏమిటి?*A) వినోదంB) అంతరిక్ష పరిశోధన*C) యుద్ధంD) వాతావరణం మార్చడం
119. మంగళ గ్రహానికి చెందిన భారత మిషన్ పేరు?
A) ఆదిత్య B) చంద్రయాన్ C) మంగళయాన్ D) విక్రమ్
120.చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశం ఏది?
A) ఇండియా B) లండన్ C) అమెరికా D) ఆస్ట్రేలియా

 

డాక్టర్ పల్లె సూర్యనాగి రెడ్డి

భౌతికశాస్ర్త అధ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కల్యాణదుర్గం,

అనంతపురం జిల్లా మొబైల్ నo: 9491155894 మెయిల్:suryassbn19@gmail.com

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్