test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది?

31 మే, 2026

class
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

1.వేగం యొక్క SI ప్రమాణం ఏమిటి?

A) మీటర్ B) మీటర్/సెకను C) కిలోగ్రాముD)న్యూటన్

2.బలం యొక్క SI ప్రమాణం ఏమిటి?

 A)జూల్  B)వాట్  C)న్యూటన్  D)పాస్కల్

3.భూమి ఆకర్షణ శక్తిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

 A)ఐన్‌స్టీన్  B)న్యూటన్  C)గెలీలియో  D)కాపెర్నికస్

4.  కాంతి వేగం ఎంత ?

A) 3×106m/s     B) 3×108m/s

 C) 3×105km/s    D) B మరియుC

5. పని  చేయగల సామర్థ్యాన్ని ఏమంటారు? 

 A)బలం  B)శక్తి  C)వేడి  D)విద్యుత్

6.శబ్దం ప్రయాణించలేని మాధ్యమం ఏది?

 A)ఘనం  B)ద్రవం  C)వాయువు  D)శూన్యం

7.విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది?

 A)వోల్ట్‌మీటర్  B)అమ్మీటర్  C)బారోమీటర్  D)థర్మామీటర్

8.ఉష్ణోగ్రతSI ప్రమాణం ఏమిటి?

 A) సెల్సియస్  B)ఫారెన్‌హీట్  C)కెల్విన్  D)జౌల్

9.నీటి మరిగే స్థానం ఎంత?

 A) 0°C  B) 50°C  C) 100°C  D) 212°C

10.విద్యుత్ నిరోధం యొక్క SI ప్రమాణం ఏమిటి?

 A)ఓమ్  B)వాట్  C)అంపియర్  D)కూలాంబ్

11.లెన్స్ శక్తి ప్రమాణం ఏమిటి?

 A)డయాప్టర్  B)జూల్  C)ఓమ్  D)న్యూటన్

12.సూర్యకాంతి ఎన్ని రంగుల సమ్మేళనం?

A) 3  B) 5  C) 7  D) 9

13.ఇంద్రధనుస్సు ఏర్పడటానికి కారణం ఏమిటి?

 A)ప్రతిబింబం  B)వ్యత్యాసం  C)వ్యతిరేకం  D)కాంతి విక్షేపణo

14.అయస్కాంతానికి ఆకర్షితమయ్యే లోహం ఏది?  

 A)రాగి  B)ఇనుము  C)అల్యూమినియం  D)వెండి

15.విద్యుత్ దీపంలో ఉపయోగించే తంతువు ఏ లోహంతో తయారవుతుంది?

 A)ఇనుము  B)టంగ్‌స్టన్  C)రాగి  D)అల్యూమినియం

16.ఘర్షణ శక్తి వల్ల ఏమి ఉత్పత్తి అవుతుంది?

 A)కాంతి  B)చలనం  C)వేడి  D)విద్యుత్

17.విమానాలు ఎగరడానికి ప్రధాన కారణం ఏమిటి?

A)న్యూటన్ మొదటి నియమం B)బెర్నోలీ సిద్ధాంతం

C)ఓమ్ సూత్రం D)పాస్కల్ సూత్రం

18. భూమి తన అక్షంపై ఒకసారి తిరగడానికి పట్టే సమయం?

A) 12 గంటలు  B) 24 గంటలు  C) 30 గంటలు  D) 48 గంటలు

19.భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి  పట్టే సమయం?

A) 300 రోజులు  B) 365¼ రోజులు

C) 400 రోజులు  D) 360 రోజులు

20.నీటిలో మునిగిన వస్తువుపై పైకి పనిచేసే బలం ఏది?

 A)గురుత్వాకర్షణ  B)అయస్కాంత బలం

C)ఉపతల బలం   D)ఉత్పలవణ బలం

21.పాస్కల్ ఏ భౌతిక పరిమాణానికి ప్రమాణం?

 A)శక్తి  B)పీడనం  C)పని  D)వేగం

22.విద్యుత్ బల్బ్‌లో విద్యుత్ శక్తి ఏ రూపంలోకి మారుతుంది?

 A)రసాయన శక్తి  B)కాంతి,ఉష్ణ శక్తి

C)యాంత్రిక శక్తి  D)అణు శక్తి

23.ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు?

A)అనుతరంగాలు   B)దీర్ఘ తరంగాలు

C)విద్యుత్ తరంగాలు  D)కాంతి తరంగాలు

24.ఒక వస్తువు స్థితి మార్పును నిరోధించే లక్షణం ఏమిటి?

A)బలం  B)జడత్వం  C)ఘర్షణ  D)పీడనం

25.ఆర్కిమిడీస్ సిద్ధాంతం ఏ విషయానికి సంబంధించినది?

 A)విద్యుత్  B)కాంతి  C)తేలడం  D)ఉష్ణం

26.సౌరశక్తి ప్రధాన మూలం ఏమిటి?

A)అణు విఘటన  B)అణు సంయోగం  C)రసాయన చర్య D)ఘర్షణ

27.శూన్యంలో కాంతి వేగం మారుతుందా?

A)మారుతుంది  B)మారదు  C)కొన్నిసార్లు  D)తెలియదు

28.లౌడ్‌స్పీకర్ ఏ శక్తిని మారుస్తుంది?

A) ధ్వని→విద్యుత్  B) విద్యుత్→ధ్వని

C) కాంతి→ధ్వని  D) వేడి→విద్యుత్

29.బ్యాటరీలో నిల్వ ఉండేది ఏ శక్తి?

A)యాంత్రిక  B)రసాయన  C)కాంతి  D)అణు

30.ఉష్ణమును కొలిచే పరికరం ఏది?

 A)అమీటర్  B)థర్మామీటర్  C)హైడ్రోమీటర్  D)బారోమీటర్

31.శబ్దం వేగం ఎక్కువగా ఉండేది ఏ మాధ్యమంలో?

 A) వాయువు  B) ద్రవం  C) ఘన  D)శూన్యం

32.విద్యుత్ ఆవేశం ప్రమాణం ఏమిటి?

 A)ఓమ్  B)కూలాంబ్  C)వాట్  D)వోల్ట్

33.సూర్యుడు ఏ వాయువులతో ఎక్కువగా నిర్మితమై ఉన్నాడు?

A) ఆక్సిజన్,నైట్రోజన్  B) హైడ్రోజన్,హీలియం

C) కార్బన్,ఆక్సిజన్  D)నీయాన్,ఆర్గాన్

34.న్యూటన్ మూడో నియమం ఏమి చెబుతుంది?

A) శక్తి సంరక్షణ   B) చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది C) బలం=ద్రవ్యరాశి×వేగవర్థన  D)వస్తువు స్థితి మారదు

35.అణువులో ధన విద్యుత్ కణం ఏది?

 A)ఎలక్ట్రాన్  B)న్యూట్రాన్  C)ప్రోటాన్  D)ఫోటాన్

36.కాంతి వక్రీభవనానికి కారణం ఏమిటి?

 A)కాంతి తీవ్రత మారటం B)కాంతి వేగ మార్పు  C)కాంతి రంగు మార్పు D) కాంతి పరిమాణం మారడం

37.అణు సంఖ్యను నిర్ణయించేది ఏది?

 A)న్యూట్రాన్‌లు  B)ప్రోటాన్‌లు  C)ఎలక్ట్రాన్‌లు  D)ఐసోటోపులు

38.చంద్రునిపై గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే ఎంత?

 A) సగం  B) 1/4  C) 1/6  D) 1/8

39.సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?

 A) భూమి  B) శని C) గురుడు  D) కుజుడు

40.విద్యుత్ శక్తి వినియోగ ప్రమాణం ఏమిటి?

A) కిలోవాట్ గంట  B) జౌల్  C) వాట్  D) వోల్ట్

41.భారత అంతరిక్ష సంస్థ ఏది?

 A) DRDO  B) ISRO C) NASA  D) HAL

42.ISRO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A)చెన్నై B)హైదరాబాద్  C)బెంగళూరు  D)ముంబై

43.భారత తొలి ఉపగ్రహం ఏది?

A) రోహిణి  B) ఆర్యభట్ట C) భాస్కర  D) ఇన్సాట్

44.ఆర్యభట్ట ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించబడింది?

A) 1969   B) 1975    C) 1980   D) 1990

45.చంద్రయాన్-1ఏ గ్రహంపైకి పంపబడింది?

 A) కుజుడు  B) చంద్రుడు  C) శుక్రుడు  D) సూర్యుడు

46.మంగళయాన్ ఏ గ్రహాన్ని అధ్యయనం చేసింది?

 A) చంద్రుడు  B) గురుడు  C) కుజుడు  D) శని

47.PSLV పూర్తి రూపం ఏమిటి?

A) Polar Satellite Launch Vehicle

B) Powerful Satellite Launch Vehicle

C) Public Satellite Launch Vehicle

D) Primary Space Launch Vehicle

48.GSLV లో “G”అర్థం ఏమిటి?

A) Giant  B) Geosynchronous  C) General  D) Global

49.భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష మిషన్ పేరు ఏమిటి?

 A) ఆదిత్య  B) గగనయాన్  C) చంద్రయాన్  D) విక్రమ్

50.చంద్రయాన్-3ల్యాండర్ పేరు ఏమిటి?

 A) విక్రమ్  B) ప్రజ్ఞాన్  C) ధ్రువ్  D) ఆర్య

51.చంద్రయాన్-3రోవర్ పేరు ఏమిటి?

 A) విక్రమ్  B) ప్రజ్ఞాన్  C) ఆర్యభట  D) రోహిణి

52.NASA ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ?

 A) రష్యా  B) అమెరికా  C) చైనా  D) జపాన్

53.ఉపగ్రహాలు ప్రధానంగా ఏ కక్ష్యలో తిరుగుతాయి?
A) గోళాకార  B) ఎలిప్టికల్  C) సూటి రేఖ  D) చతురస్రాకార

54.భూమికి అత్యంత సమీప గ్రహం ఏది?

 A) కుజుడు  B) శుక్రుడు  C) బుధుడు  D) గురుడు

55.అంతరిక్షంలో శబ్దం ఎందుకు వినిపించదు?

A)కాంతి లేదుB)గాలి లేదుC)గురుత్వాకర్షణ లేదుD)వేడి లేదు

56.సూర్యునికి అత్యంత సమీప గ్రహం ఏది?

 A) శుక్రుడు  B) భూమి  C) బుధుడు  D) కుజుడు

57.భూమి సహజ ఉపగ్రహం ఏది?

 A) మంగళ్  B) చంద్రుడు  C) టైటాన్  D)యూరోపా

58.అంతరిక్షంలో ప్రయాణించే వ్యక్తిని ఏమంటారు?

 A) పైలట్  B) ఖగోళ శాస్త్రవేత్త  C) వ్యోమగామి  D) నావికుడు

59.మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు?

 A) కల్పనా చావ్లా  B) రాకేష్ శర్మ

C) సునీతా విలియమ్స్  D) విక్రమ్ సారాభాయి

60.“సారే జహాంసే అచ్చా” అని అంతరిక్షంలో అన్న భారతీయుడు ఎవరు?

 A) అబ్దుల్ కలాం  B)రాకేష్ శర్మ

C) విక్రమ్ సారాభాయి  D) సతీష్ ధావన్

డాక్టర్.పి.సూర్యనాగి రెడ్డి భౌతికశాస్ర్త అధ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కల్యాణదుర్గం, అనంతపురం జిల్లా మొబైల్ నo: 9491155894 మెయిల్:suryassbn19@gmail.com

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్