test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైద్యవిద్యలో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట

25 మే, 2026

carrer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 06:15 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

దేశంలోనే వైద్య విద్యలో అత్యుత్తమంగా నాణ్యమైన, అధునాతన సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ పరిపాలనలో సమర్థత, క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ వేగంగా ఫలితాలు విడుదల చేస్తూ ఆదర్శప్రాయంగా సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న విశ్వవిద్యాలయంగా విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిలిచింది.కేరళ,తమిళనాడు,కర్నాటక వంటి రాష్ర్టాలే కాకుండా దేశంలోని పలు రాష్ర్టాలకు వైద్య విద్యలో ఆదర్శప్రాయంగా నిలుస్తూ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది.దేశవ్యాప్తంగా ఉన్న 825 మెడికల్ కళాశాలల ద్వారా ఏటేటా వైద్యవిద్యను సుమారు 1.25 లక్షల మంది వరకూ అభ్యసిస్తున్నారు.కేంద్ర కుటుంబ,ఆరోగ్యమంత్రిత్వ శాఖ వైద్య విద్యాకోర్సులను మరో 75 శాతం పెంచాలనే ఆలోచన చేస్తుండటంతో మరిన్ని సీట్లు పెరిగే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.జీవితంలో డాక్టర్ వృత్తిని ఎంచుకోవాలనుకునే యువత మెరిట్ ప్రాతిపదికన కృషిచేస్తే ఖచ్చితంగా సీటు సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు.దేశవ్యాప్తంగానూ,మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ,ప్రయివేటు,కార్పొరేట్ విభాగాల్లో వైద్య విద్యను చదువుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలోనూ,దానికి అనుబంధంగా ఉన్న కళాశాల్లోనూ మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య విద్యలోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ (ఎఐ)విధానాన్ని ప్రవేశపెట్టాం.విద్యలో అత్యుత్తమ చికిత్సా పద్ధతులు-విధానాలు తెసుకోవటానికి ఎఐ సేవలు వినియోగిస్తున్నాం.యూనివర్శిటీ తరపున అమరావతిలో రీసెర్చ్ బ్లాకును ఏర్పాటుచేయబోతున్నాం.గూగుల్,క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించుకునేలా బయోఫిజిక్స్,ఇన్ఫర్మేటిక్స్,ఎమర్జెన్సీ నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్ లో(ప్రథమ చికిత్స) ప్రత్యేక కోర్సులు ఏర్పాటుచేస్తున్నాం.ఇవే కాకుండా జిరియాటిక్,ఫ్యామిలీ మెడిసిన్ కోర్సులు కూడా ప్రవేశపెట్టేందుకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది వరకూ యూజీ,పీజీ,నర్సింగ్,సూపర్ స్పెషాలిటీ ఇలా పలు విభాగాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.ఏటేటా సుమారు2 లక్షల మంది వరకూ విద్య,పరిశోధన,పరీక్షల రూపాల్లో యూనివర్శిటీ ద్వారా పలు విభాగాల ద్వారా సేవలు పొందుతున్నారు.
దేశంలో వైద్య విశ్వ విద్యాలయాల్లో మొట్టమొదటిదిగానూ,అతి పెద్దదిగా చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా నిరంతరం వైద్య రంగంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ నాణ్యమైన, పారదర్శకమైన,సృజనాత్మకను ఏటేటా పెంపొందించుకుంటూ వైద్య వైద్యను అందిస్తున్నాం.యూనివర్శిటీ పరిధిలో 356 వరకూ అనుబంధ కళాశాలలు కూడా ఉన్నాయి.వీటిలో అండర్‌ గ్రాడ్యుయేట్‌,పోస్టుగ్రాడ్యుయేట్‌,డాక్టోరల్‌,సూపర్‌ స్పెషాలిటీ,డెంటిస్టిటీ,పిహెడ్‌డి వంటి 129 వరకూ కోర్సులు ఉన్నాయి.యుజిసి గుర్తింపుతోపాటుగా ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సి),సెంట్రల్‌ కౌన్సిలర్‌ ఆఫ్‌ హోమియోపతి(సిసిహెచ్‌),సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సిసిఎం)తోపాటుగా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ)ద్వారా గుర్తింపు పొందిన యూనివర్శిటీగా పేరుగాంచింది.సుమారుగా ఏటేటా 30వేల మంది వరకూ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.వైద్యవిద్య కోసం దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం విజయవాడలో నాణ్యతాప్రమాణాలతో నిపుణులైన వైద్యులను అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది.ఈ ఏడాది ని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 29, 30వ వార్షికోత్సవాలను జూన్ 2వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకోబోతోంది.సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేడు మారుమూల పల్లెలకు కూడా వైద్యం అందుబాటులోకి రావడం చాలా మంచి పరిణామం.రాష్ట్రంలో వైద్యవిద్యలో యూజీ,పీజీ సీట్లు పెరగడం సంతోషకరం. విశ్వవిద్యాలయ పరిధిలో మొత్తంగా 554కాలేజీలు పనిచేస్తున్నాయి.వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలను పాటించటంతోపాటుగా అత్యాధునిక సాంకేతిక విద్య రోబోటిక్స్, కృత్రిమ మేథను సైతం వినియోగిస్తున్నాం.పరిశోధన (రీసెర్చ్‌)లకు పెద్దపీట వేస్తున్నాం.యూనివర్సిటీకి అమరావతిలో ప్రభుత్వం భూములను కేటాయించడం ఎంతో శుభపరిణామం.గడిచిన మూడు దశాబ్ధాలకాలంలో విశ్వవిద్యాలయం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయి.గడిచిన ఏడాది కాలంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా సరికొత్త కార్యక్రమాలను అమలుచేస్తూ దేశంలోనూ మోడల్ యూనివర్శిటీగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని రూపొందించాం.
యూనివర్సిటీ తన అనుబంధ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్(యుజి) , పోస్ట్ గ్రాడ్యుయేట్ ( పిజి) , సూపర్ స్పెషాలిటీ, పిహెచ్ డి , పిడిఎఫ్ కోర్సులను మోడరన్ మెడిసిన్,డెంటల్ సర్జరీ, ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి,నర్సింగ్,ఫిజియోథెరపీ,పారా మెడికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల తో ఉన్నది . డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయంకు ప్రారంభంలో 27 అనుబంధంగా ఉండి , ప్రస్తుతము మొత్తం కళాశాలల సంఖ్య 271వరకు ఉన్నాయి.

 

యూనివర్సిటీ లోని మెడికల్ కోర్సులివే...

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (NTRUHS) రాష్ట్రంలో వైద్య, అనుబంధ కోర్సులకు సంబంధించిన ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించే ప్రధాన విశ్వవిద్యాలయం.
• 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
• డిజిటల్ హెల్త్ మానిటరింగ్, అడ్మినిస్ట్రేషన్ పటిష్టత కోసం యూనివర్సిటీలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.
• ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, కౌన్సెలింగ్ వివరాలను Dr. NTRUHS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
• కోర్సులు (Courses):
• UG కోర్సులు: MBBS, BDS, BAMS, BHMS, BUMS, BNYS, మరియు B.Sc. నర్సింగ్.
• PG కోర్సులు: MD, MS, MDS, మరియు M.Sc. నర్సింగ్.
• ఇతర కోర్సులు: పారామెడికల్, అలైడ్ హెల్త్‌కేర్ , డిప్లొమా కోర్సులు.
• ప్రవేశ విధానం (Admissions):
• MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు NEET-UG స్కోరు తప్పనిసరి.
• PG కోర్సుల కోసం NEET-PG లో సాధించిన మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ జరుగుతుంది.
• బి.ఎస్.సి (B.Sc) నర్సింగ్ వంటి వాటికి ఆంధ్రప్రదేశ్ EAPCET ద్వారా ప్రవేశాలు ఉంటాయి.
కోర్సు పేరు, ఫీజులు, అర్హత
ఎం.బి.బి.ఎస్. (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) : 10+2 విద్యలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి, ఈ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు, నీట్ (NEET) ప్రవేశ పరీక్షలో అర్హత స్కోరు సాధించి ఉండాలి.
బి.ఎస్.సి. (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 విద్య, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కనీసం 50 శాతం మార్కులు, ప్రవేశ పరీక్షలో చెల్లుబాటు అయ్యే స్కోరు సాధించి ఉండాలి.
డిప్లొమా : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 విద్య, కనీసం 50 శాతం మార్కులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
ఎం.ఎస్.సి. (మాస్టర్ ఆఫ్ సైన్స్) :
సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ, కనీసం 50 శాతం మార్కులు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా : సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ, అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు, ప్రవేశ పరీక్షలో అర్హత స్కోరు, సంబంధిత రంగంలో ముందస్తు పని అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
పి.హెచ్.డి. (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) : సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులలో కనీసం 55శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు కనీస అర్హత మార్కులలో 5% సడలింపు, చెల్లుబాటు అయ్యే యూజీసీ-నెట్ లేదా సీఎస్ఐఆర్-నెట్ అర్హత, ఎన్టీఆర్‌యూహెచ్ఎస్ నిర్వహించే పీహెచ్‌డీ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎం.డి. (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) : గుర్తింపు పొందిన వైద్య కళాశాల నుండి ఎంబీబీఎస్ డిగ్రీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్, తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి, ఇంటర్న్‌షిప్ తర్వాత కనీసం ఒక సంవత్సరం అనుభవం, నీట్ పీజీ పరీక్షలో ప్రతిభ.
బి.పి.టి. (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి సబ్జెక్టులుగా 10+2 లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
బి.డి.ఎస్. (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ), ఎం.పి.టి. (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) :
ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ, కనీసం 50శాతం అగ్రిగేట్ మార్కులు, 6 నెలల ఇంటర్న్‌షిప్
M.D.S. (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ): బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS), ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్, BDS డిగ్రీలో కనీసం 50 శాతం sఅగ్రిగేట్ స్కోర్
B.A.M.S. (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ)
10+2 విద్య, ఫిజిక్స్, కెమిస్ట్రీ , బయాలజీలో కనీసం 50శాతం అగ్రిగేట్ మార్కులు, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో అర్హత
B.H.M.S. (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ)
10+2 పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి సబ్జెక్టులుగా, కనీసం 50 శాతం అగ్రిగేట్ మార్కులు, NEET ప్రవేశ పరీక్షలో చెల్లుబాటు అయ్యే స్కోర్
B.N.Y.S. (బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్) :
10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి, నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత పొంది ఉండాలి.
బి.యు.ఎం.ఎస్. (బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ)
10+2 విద్యలో సైన్స్ విభాగంలో కనీసం 50 శాతం మార్కులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీని తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి, నీట్ పరీక్షలో ఉత్తీర్ణులై, చెల్లుబాటు అయ్యే నీట్ స్కోరు కలిగి, విశ్వవిద్యాలయం నిర్దేశించిన వయోపరిమితిని కలిగి ఉండాలి.

- పూలాల చంద్రశేఖర్‌

ఎన్టీఆర్‌ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం,

ఉప కులపతి (వీసీ), ప్రముఖ గుండె వైద్య నిపుణులు,

విజయవాడ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్