న్యూఢిల్లీ : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి-యుజి) 2026 కు సంబంధించిన సవరించిన పరీక్ష తేదీలను,అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఎ) గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలు ప్రస్తుతం మే 31, జూన్ 6, 7 తేదీలలో నిర్వహించబడతాయని ఎన్ టి ఎ తెలిపింది. మే 31పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్ కార్డులు విడులయ్యాయని, వాటిని cuet.nta.nic.in. అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎన్ టి ఎ అభ్యర్థులకు సూచించింది. జూన్ 6, 7 తేదీల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయబడతాయని ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎన్ టి ఎ వెల్లడించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు మే 28 ఈద్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
CUET-UG పరీక్షల సవరించిన షెడ్యూల్ విడుదల
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 12:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)