test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

01 జూన్, 2026

exams
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 10:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను నిర్వహించిన ఐఐటీ కాన్పూర్ సోమవారం ఉదయం అధికారికంగా ఫలితాలను ప్రకటించింది. ఫలితాలతో పాటు ఫైనల్ కీ, కటాఫ్ మార్కులు మరియు ఆల్ ఇండియా ర్యాంకుల జాబితాను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్  jeeadv.ac.inలోకి వెళ్లాక ‘JEE Advanced 2026 Result’ లింక్‌పై క్లిక్ చేయాలి. మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ (DOB), మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

రేపటి నుంచే ‘జోసా’ కౌన్సెలింగ్

ఫలితాల విడుదలైన నేపథ్యంలో, ఐఐటీలు, ఎన్‌ఐటీలు (NITs), ఐఐఐటీల్లో (IIITs) సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే జోసా (JoSAA)-2026 కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటి నుంచి (జూన్ 2) ప్రారంభం కానుంది. అర్హత సాధించిన విద్యార్థులు రేపటి నుంచి తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్