test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 5 నుంచి టెట్‌

2 రోజుల క్రితం

Tet from August 5th
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నేడు నోటిఫికేషన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆగస్టు 5 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ‌జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ‌శుక్రవారం విడుదల కానుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ నెల 5 నుంచి జులై 5వ తేది వరకు ఫీజు చెల్లింపు, అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. http://cse.ap.gov.in/ ద్వారా ఆన్‌‌లైన్‌‌లోనే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జులై 15 నుంచి ఆన్‌‌లైన్‌ ‌మాక్‌‌టెస్ట్‌ అందుబాటులో ఉంటుంది. అభ్యర్ధులు జులై 25 నుంచి హాల్‌ ‌టిక్కెట్లు డౌన్‌‌లోడ్‌ ‌చేసుకోవచ్చును. ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు టెట్‌ ‌పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలలో జరగనుంది. సెప్టెంబర్‌ 15‌వ తేదిన ఫలితాల ప్రకటన ఉంటుంది. టెట్‌‌కు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాలు http://tet2dsc.apcfss.in/ వెబ్‌‌సైట్‌‌లో పొందుపరిచామని టెట్‌ ‌కన్వీనర్‌ ఎం వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్ధులకు సందేహాలు ఉంటే ఈ ఫోన్‌ ‌నెంబర్లను సంప్రదించాలని 8121947387, 8125046997, 7995649286,7995789286, 9398810958, 6281704160 తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్