test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టెట్ స్కోరు చేయి.. ఉపాధ్యాయుడిగా స్థిరపడు

4 గంటల క్రితం

tet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

డిఎస్సీ ( DSC) మెరిట్ జాబితాలో టెట్ ( TET) స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు సాధించిన టెట్ మార్కులను 150 (మొత్తం మార్కులు)తో భాగించి, వచ్చిన ఫలితాన్ని 20తో గుణిస్తే టెట్ వెయిటేజీ మార్కులు వస్తాయి. మిగిలిన80 శాతం మార్కులను డిఎస్సీ రాత పరీక్ష ఆధారంగా లెక్కిస్తారు. ఉపాధ్యాయ కొలువులు ఆశిస్తున్న ఆశావాహ ఉపాధ్యాయులకు Andhra Pradesh Teacher Eligibility Test (AP TET), June 2026 ఎంతో కీలకమైంది.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) ను పాఠశాల విద్యాశాఖ మొత్తంనాలుగు పేపర్లుగా విభజించి నిర్వహిస్తోంది.
అవి:పేపర్‌-1ఎ,పేపర్‌-1బి,పేపర్‌-2ఎ,పేపర్‌-2బి.
పేపర్- 1A (Paper-1A):
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించాలనుకునే సాధారణ ఉపాధ్యాయుల కోసం ఇది నిర్వహించబడుతుంది.
పేపర్- 1B (Paper-1B):
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలల్లో (Special Schools)బోధించే ఉపాధ్యాయుల కోసం ఈ పేపర్‌ ఉంటుంది.
పేపర్- 2A (Paper-2A):
6వ తరగతి నుండి 8వ తరగతి వరకు సాధారణ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (SA)గా బోధించాలనుకునే వారి కోసం ఇది ఉద్దేశించబడింది
పేపర్- 2B (Paper-2B):
6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలల్లో (Special Education Schools) బోధించే ఉపాధ్యాయుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు
ఈ నాలుగు పేపర్లలో ప్రతి ఒక్కటీ150 మార్కులకు, 2.30 గంటల వ్యవధిలో మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలతో ( MCQs) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ( CBT) విధానంలో జరుగుతాయి.


జులై 5 వరకూ దరఖాస్తులు
ఏపీ టెట్‌-2026 షెడ్యూల్‌(AP TET Schedule) నోటిఫికేషన్ ను జూన్‌ 5న విడుదల చేయగా అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.జులై 5వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉంది.జులై 25నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.ఆగస్ట్‌5 నుంచి21 వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్‌,మధ్యాహ్నం2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌ ఉంటుంది. ఆగస్ట్‌24న ప్రాథమిక కీ,సెప్టెంబర్‌8న ఫైనల్‌ కీ విడుదల చేయనున్నారు.సెప్టెంబర్‌15న టెట్‌ ఫలితాలు వెల్లడి కానున్నాయి.


టెట్ సిలబస్ లో స్వల్ఫమార్పులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)పాఠ్యప్రణాళికలను పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలో ఐటీ, పర్యావరణం, ఆంగ్ల పాఠ్యాంశాలను అదనంగా చేర్చారు. డిజిటల్‌, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినందున ఈసారి బహుళ ప్రసార సాధనాలు(ఐసీటీ)సబ్జెక్టును చేర్చారు. పిల్లల అభివృద్ధి, పెడగాజీలో కొన్ని నూతన పాఠ్యాంశాలు చేర్చారు. ఐసీటీలో 12 పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఐసీటీ రెండో విభాగంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చిన మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొచ్చే మార్పులను చేర్చారు. 
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ)మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థికి టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌)అర్హత తప్పనిసరి. ఒక సారి టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది.


అర్హత మార్కులివీ...
టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులు కనీసం 60 శాతం
బీసీలు50 శాతం
ఎస్సీ,ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతులు, మాజీ సైనికోద్యోగులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి.


పక్కా ప్రణాళిక కీలకం
టాప్ స్కోర్ సాధించాలి AP TET 2026 పరీక్షలో కేవలం 50రోజుల్లో టాప్ స్కోర్ సాధించడానికి పక్కా ప్రణాళిక, సిలబస్ పై అవగాహన, సరైన రివిజన్ అత్యంత కీలకం. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టును ఎలా విభజించుకుని చదవాలి.


సబ్జెక్ట్-వైజ్ ప్రిపరేషన్ టిప్స్ (Subject-Wise Strategy)
చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోగి(Child Development & Pedagogy - 30 మార్కులు)_
లాంగ్వేజ్2 - ఇంగ్లీష్(Language II - 30 మార్కులు)
గణితం &ఇవిఎస్ /సోషల్ /సైన్స్(Mathematics & Content - 60మార్కులు)


విజయానికి ఇవి దోహదం

విజయం సాధించడానికి ముఖ్యమైన సూత్రాలు (Success Rules)
అత్యధిక మార్కులు సాధించాలంటే కేవలం కష్టపడి చదవడం సరిపోదు, స్మార్ట్ వర్క్, పక్కా ప్లానింగ్ అవసరం.
టెట్ స్కోర్‌కు డిఎస్సీ (DSC)లో 20 శాతం వెయిటేజీ ఉంది.
ఇందులో సాధించే ప్రతి మార్కు మీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తుందని గమనించుకోవాలి.


అకాడమీ పాఠ్యపుస్తకాలు (Follow AP SCERT Textbooks) : 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పాఠ్యపుస్తకాలను(SCERT Books) లైన్ టు లైన్ చదవాలి.టెక్స్ట్‌బుక్స్ చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు,బాక్సుల్లో ఇచ్చే సమాచారం (Do you know?), ఉదాహరణలను సొంతంగా షార్ట్ నోట్స్ రాసుకోవాలి.
మునుపటి ప్రశ్నల విశ్లేషణ (Master Past Papers – PYQs) : గతంలో జరిగిన టెట్ ఆన్‌లైన్ పరీక్షల(ముఖ్యంగా రీసెంట్ సెషన్స్)అన్ని షిఫ్టుల ప్రశ్నపత్రాలను సేకరించండి.ఏ టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి,ప్రశ్నల సరళి ఎలా ఉందో అర్థం చేసుకుంటే అనవసరమైన అంశాలు చదవడం తప్పుతుంది.
మెథడాలజీ(Pedagogical Concerns) పై పట్టు : ప్రతి సబ్జెక్టులోనూ కంటెంట్‌తో పాటు మెథడాలజీ (బోధనా పద్ధతులు)ఉంటుంది.చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోగితో పాటు మిగిలిన సబ్జెక్టుల మెథడాలజీలను కలిపితే దాదాపు 54మార్కులు కేవలం పెడగోగి నుంచే వస్తాయి. ఇందులో స్కోర్ పెరిగితేనే మీకు అత్యధిక మార్కులు వస్తాయి.


అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్(Application-Based Learning)
ఇప్పుడు టెట్‌లో నేరుగా అడిగే ప్రశ్నల(Direct Questions) సంఖ్య తగ్గింది. ముఖ్యంగా సైకాలజీ,మెథడాలజీలో ఒక తరగతి గది పరిస్థితిని ఉదాహరణగా ఇచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు.కాన్సెప్ట్‌ను బట్టి పట్టకుండా,నిత్యజీవితంలో దాన్ని ఎలా అన్వయించాలో నేర్చుకోండి.
రోజువారీ ప్రాక్టీస్ &మాక్ టెస్టులు (Daily Practice & Mock Tests) : రోజుకు కనీసం 1లేదా2చాప్టర్ వైజ్ టెస్టులు రాయండి. టెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT)కాబట్టి, సిస్టమ్ లేదా మొబైల్‌లో ఆన్‌లైన్ మాక్ టెస్టులు రాయడం వల్ల భయం పోతుంది. టెస్ట్ రాసిన తర్వాత ఏ ప్రశ్నలు తప్పయ్యాయో చూసి,ఆ టాపిక్‌ను వెంటనే మళ్లీ రివైజ్ చేయాలి.
వీక్లీ రివిజన్ ప్లాన్ (Weekly Revision) : కొత్త విషయాలు చదవడం ఎంత ముఖ్యమో,చదివిన దాన్ని మర్చిపోకుండా ఉండడం అంతే ముఖ్యం.వారంలో5రోజులు కొత్త టాపిక్స్ చదివితే,మిగిలిన2రోజులు కేవలం పాత వాటిని రివైజ్ చేయడానికి మరియు గ్రాండ్ టెస్టులు రాయడానికే కేటాయించాలి.

వెబ్ సైట్లో పూర్తి వివరాలు ఏపీ టెట్‌ 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5వ తేదీన విడుదల చేసి పూర్తి సమాచారం డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జాయింట్‌ డైరెక్టర్,ఏపీ టెట్‌ కన్వీనర్‌ ఎం. వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల సందేహాలను తీర్చడం కోసం డైరెక్టర్‌ కార్యాలయంలో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ అందుబాటులో ఉండేలా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

 

కె.ఎస్. లక్ష్మణరావు,

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు,

మాజీ శాసనమండలి సభ్యులు, సెల్ : 8309965083

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్