ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : “విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడెట్ (U-17)జూడో ఛాంపియన్‌షిప్ – 2026 లో విజయనగరం జిల్లా గురుదేవ్ జూడో అసోసియేషన్‌కు చెందిన క్రీడాకారుడు “మొహమ్మద్ సిద్దిక్” విశిష్ట ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పంజాబ్‌లోని చండీగఢ్‌లో జూన్ 10 నుండి 13 వరకు జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ క్యాడెట్ నేషనల్స్ పోటీలకు అర్హత సాధించాడు. క్రీడాకారుడిని గురుదేవ్ జూడో అసోసియేషన్ ఛైర్మన్ బి. చంద్రశేఖర్ రావు (రిటైర్డ్ పోలీస్ అధికారి), జనరల్ సెక్రటరీ & కోచ్ రామకృష్ణ, పాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి పప్పు విశ్వనాథ్, అలాగే గురుదేవ్ జూడో అసోసియేషన్ సభ్యులు అభినందించి, జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఎపి రాష్ట్ర క్యాడెట్ జూడో ఛాంపియన్‌షిప్ లో విజయనగరం కుర్రాడి ప్రతిభ
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)