ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కొందకరకాం బొంతు కొండపై అక్రమ క్వారీ తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వడం అప్రజాస్వామిక చర్య అని, ప్రజాభిప్రాయం తీసుకోకుండా కనీసం పంచాయతీ తీర్మాణం లేకుండా అక్రమంగా దొడ్డి దారిన అనుమతులు ఇవ్వడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, గ్రామ ఎంపీటీసీ ఆదినారాయణ సర్పంచ్ రాంబాబు, పూర్వ సర్పంచ్ గౌరునాయుడు, మాజీ ఎంపీటీసీ రాంబాబు, పోరాట కమిటీనాయకులు శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి. రమణ తదితరులు తీవ్రంగా ఖండించారు. బుధవారం కొండకరకాంలో సిపిఎం వేసిన కరపత్రాని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ …. వేపాడ మండలంలో కొండ గంగుపూడి వద్ద క్వారీ మంజూరి కోసంఈ నెల 12 న అక్కడ గ్రామ సభ నిర్వహించిన అధికారులు కొండకరకాం గ్రామంలో మాత్రం ఎటువంటి గ్రామ సభ నిర్వహించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. బొంతు కొండ క్వారీ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని, లేదంటే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. బొంతు కొండపై శివాలయం ఉన్నదని. శివాలయం కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మాణం గ్రామ కమిటీ చేపట్టారు. అలాగే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కొండ తొలగిస్తే పర్యావరణం దెబ్బ తిoటుందని కిందన ఉన్న మెడికల్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ, ఈ ఎస్ ఐ హాస్పిటల్ చుట్టు ఉన్న విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కాబట్టి తక్షణమే అక్రమ క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులుతో చర్చించకుండా ఏకపక్షం గా తహసీల్దార్ ఎలా నో అబ్జిక్షసన్ సర్టిఫికెట్ ఇచ్చారో తహసీల్దార్ సమాధానం చెప్పాలన్నారు. బొంతుకొండపై 10 ఏళ్లకి క్వారికి ఇచ్చిన అక్రమ అనుమతులు రద్దు చేసే వరకు పోరాడతామని హెచ్చిరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
కొండకరకాం బొంతు కొండ క్వారీ అనుమతులు రద్దు చేయకపోతే ప్రజా పోరాటం : సిపిఎం
17 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)