చోడపల్లి (విశాఖ) : అనకాపల్లి నుండి అచ్చుతాపురం రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని బుధవారం చొడపల్లి, కొండకర్ల పరిధిలో నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం అధ్యక్షులు కే రామ సదాశివరావు , ఆర్ రాము మాట్లాడుతూ …. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలో పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ఆర్ అండ్ బి ,రెవెన్యూ అధికారులు నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ రోడ్డు విస్తరణలో 1200 మంది నష్టపోతున్నారని రోడ్డు విస్తరణకు తమ విలువైన భూములు ఇచ్చి త్యాగం చేస్తూ సహకరిస్తున్న నిర్వాసితులకు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పారు. టిడిఆర్ బాండ్లు వద్దని ముక్తకంఠంతో నిర్వాసితులందరూ వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం నిర్వాసితులు ఆమోదం లేకుండా వాళ్లు ఇష్టానుసారం రోడ్డుకు ఇరువైపులా పనులు చేపడుతుందన్నారు. నిర్వాసితులు ఆమోదం లేకుండా పనులు చేపట్టడం చట్ట వ్యతిరేకం వెంటనే అధికారులు నిర్వాసితులతో సమావేశం నిర్వహించి వీరి సమస్యలు పరిష్కరించాలని కోరారు లేదంటే నిర్వాసితులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత నాయకులు బ్రహ్మాజీ, కే సోమనాయుడు, కాకి శంకర్రావు, అప్పారావు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి టు అచ్చుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు న్యాయం చేయాలి
17 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)