test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రావెల్ బస్సు బోల్తా

17 మే, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 03:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కంచిలి (శ్రీకాకుళం) : ట్రావెల్ బస్సు బోల్తాపడి ఇద్దరికి స్వల్పగాయాలైన ఘటన కంచిలి మండలంలోని బురగాం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. కర్నూలు జిల్లా నుంచి కాశీకి వెళుతున్న ట్రావెల్ బస్సు నిన్న రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడువూరు మండలం దొడ్డి మేకల గ్రామం నుంచి 14 వ తేదీ ఉదయం 40 మంది యాత్రికులతో ట్రావెల్ బస్సు బయలుదేరింది. కంచిలి మండలం బూరగాం గ్రామ సమీపానికి వచ్చే సమయంలో పక్క నుంచి వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నాగూరు వీర ప్రతాప్ రెడ్డి తో పాటు ఏజెంట్ పామిడి ఆదినారాయణ రెడ్డి లకు స్వల్ప గాయాలయ్యాయి. యాత్రికులందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కంచిలి ఎస్సై పారినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, బాధితులకు తాత్కాలిక బస ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్