test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం ప్రాజెక్టులో పులి

17 ఏప్రిల్, 2026

polavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఏప్రి 17, 2026, 09:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – పోలవరం : ఆరు రోజుల క్రితం పోలవరం జిల్లా మంటూరు గ్రామం వద్ద గోదావరి దాటి పోలవరం మండలంలోకి ప్రవేశించిన పులి పోలవరం ప్రాజెక్టులో జంట గుహల ప్రాంతంలో శుక్రవారం ఉదయం కనిపించడంతో ప్రాజెక్టు కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లిపోయిందనుకున్న పులి దిశ మార్చుకుని ప్రాజెక్టు ప్రాంతంలోకి ప్రవేశించడంలో అంతా భయాందోళనకు గురిచేస్తోంది. రేడియో ట్రాకర్‌ ద్వారా పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన అటవీక్షేత్రాధికారి ఎస్‌కె.వలీ, జంగారెడ్డిగూడెం డిఎఫ్‌ఒ వెంకటసుబ్బయ్య… పులిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందంతో చేగొండపల్లి రిజర్వు ఫారెస్టు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుండి డ్రోన్‌ కెమెరా, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్‌ ద్వారా దాని కదలికలను పరిశీలించారు. అటవీక్షేత్రాధికారి వలీ మాట్లాడుతూ.. పెద్దపులి గత రాత్రి గోదావరి నదిని దాటడానికి ప్రయత్నించి ప్రాజెక్టులో వెలుగులు, శబ్దాలకు భయపడి వెనుదిరిగి అడవిలోకి వెళ్లిందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్