బీసెంట్ రోడ్డు (విజయవాడ) : హాకర్లు ఉపాధిని దెబ్బతిసే జోన్లు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని విజయవాడ హాకర్స్, తోపుడు బండ్లు యూనియన్ -(సిఐటియు) డిమాండ్ చేసింది. శుక్రవారం నగర సమావేశంలో హాకర్స్ యూనియన్ అధ్యక్షులు దొనేపూడి.కాశీనాధ్ మాట్లాడుతూ …. మున్సిపల్ కార్యాలయంలో గుర్తింపు కార్డుల కోసం నమోదు చేసిన తర్వాత అధికారులు ఇచ్చిన రసీదులను ఈ రోజు యూనియన్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. జోన్లు విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 29 న జరిగే ఛలో మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు సెంట్రల్ సిటి ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు, తూర్పు నగర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరావు, నగర కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు, హాకర్స్ యూనియన్ నగర అధ్యక్షులు భూలోకం, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.మురళి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.లక్ష్మణ్, కోశాధికారి ఉదయకుమార్, నగర ఉపాధ్యక్షులు, కార్యదర్శిలు మస్తాన్, పెద్దబాజీ, స్రవంతి, బి.లక్ష్మి, పి. శ్రీను, రామారావు, బుజంగారావు, చంద్రశేఖర్, ఈశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జోన్లు విధానాన్ని రద్దు చేయాలి : విజయవాడ హాకర్స్, తోపుడు బండ్లు యూనియన్ (సిఐటియు)
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 03:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)