test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.నాలుగు కోట్ల మంచి నీటి పైపు లైనుకు లీకులు

08 మే, 2026

pipe leak
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 08, 2026, 03:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పైప్లైన్ నిర్మాణం చేపట్టి చాలా కాలం అవ్వడంతో ఇనుప పైపు లకు లీకులు

  • పట్టించుకోని అధికారులు

  • మరమ్మతుల కంటే కొత్త ఇనుప పైపులైన్ వేయాలి

  • రెండు దశాబ్దాల కాలం క్రితం వేసిన ఇనుప పైపులు.

ప్రజాశక్తి-పర్చూర్ (బాపట్ల) : కారంచేడు కొమ్ముమూరు కిష్ట కాలవ నుండి పర్చూరు మీదుగా అన్నంబోట్లవారిపాలెం గ్రామ చెరువుల వరకు వేసిన మంచినీటి పైప్ లైన్ పర్చూరు సమీపంలో లీకులు ఏర్పడి తాగునీరు వృధాగా పోతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు గాని, సిబ్బంది గాని గత రెండు రోజుల నుంచి వృధాగా పోతున్న తాగునీరు నిలుపుదల చేసే ప్రయత్నం చేయలేదంటే ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. కారంచేడు నుండి ఉప్పుటూరు నాగులపాలెం, పర్చూరు, తిమ్మరాజుపాలెంమీదుగా అన్నంబోట్ల వారి పాలెం వరకు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో వేసిన పైప్ లైన్ నిర్మాణం జరిగి రెండు దశాబ్దాల కాలము అవడంతో ఇనుప పైపు లకు లీకులు ఏర్పడుతున్నాయని ఆయా గ్రామ ప్రజలు శుక్రవారం ప్రజాశక్తికి తెలిపారు.ఉప్పుటూరు,నాగులపాలెం, పర్చూరు,అన్నంబోట్ల వారి పాలెం,తిమ్మరాజుపాలెం తదితర గ్రామాల ప్రజలకు ఈ పైప్ లైన్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఈ పైప్లైన్ ద్వారా మంచినీరు చెరువులకు పట్టిస్తున్నారు. ఈనేపథ్యంలో పర్చూరు వాగు బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఇనుప పైపులైను జాయింట్ల వద్ద లీకులు, కొన్ని చోట్ల రంధ్రాలు ఏర్పడి తాగునీరు వృధాగా పోతుంది.అదేవిధంగా గుంటూరు రోడ్ లోని అంబేద్కర్ పరివర్తన భవనం సమీపంలో రోడ్డు మార్గంలోని మార్జిన్లో పైప్లైన్ పగిలి నీరంతా వృధాగా పోతున్నది. అదే విధంగా ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని చప్తా ఫై ఉన్న ఇనుప పైపులైను లీకేజీ ఏర్పడి నీరంతా పోతుంది. ఈ పైపులైన్ ద్వారా అన్నంబోట్లవారిపాలెం చెరువులకు నీరు సరిగ్గా అందడం లేదని ఆయా గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంబంధించిన శాఖల అధికారులు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బాధ్యతారాహిత్యం సిబ్బంది పర్యవేక్షణ లోపాలతో కోట్లతో ఖర్చు పెట్టిన ప్రాజెక్టు సరిగా పనిచేయక నీరుగారిపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ పైపులైను బాగుపరిచి లేదా కొత్త పైప్లైన్ చేసి తాగునీటిని ఆయా గ్రామాలకు సరిగా వెళ్లే విధంగా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్