test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమ్మో.. చిరుత పులి..!

1 రోజు క్రితం

Oh my... a leopard!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

* రేగళ్ళు – బాలంవారిపల్లి గ్రామాల్లో చిరుత సంచార కలకలం
* ఉపాధి హామీ కూలీకి కనిపించినట్లు సమాచారం..
* అప్రమత్తమైన గ్రామస్తులు
* అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేత

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరు మండలంలోని రేగళ్ళు, బాలంవారిపల్లి పంచాయతీల పరిధిలో చిరుత పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం ఉపాధి హామీ పనుల కోసం గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లిన ఓ కూలీ, పొదల మధ్య చిరుతను పోలిన జంతువు సంచరిస్తున్నట్లు గమనించినట్టు గ్రామస్తులకు తెలిపాడు. ఆ కూలీ తెలిపిన వివరాలు గ్రామంలో వేగంగా వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే ఆ జంతువును చూసిన కొద్ది సేపటికే అది అడవివైపు వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని కొందరు గ్రామస్తులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. చిరుత సంచారంపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది గ్రామ శివారు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనపై దృష్టి సారించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్