DRISHYAM
సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబడి తెరుచు వేళ!

16 జూన్, 2026

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 09:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సెలవులు ముగిసి,
బడులు తెరుచు వేళ,
పిల్లలకు ఎంత సంతోషమో,
కొత్త పుస్తకాల వాసన చూడొచ్చని!
​
తల్లిదండ్రులకు ఎంత వరమో,
పిల్లలకు అక్షరాలతో పాటు
అన్నమూ దొరుకుతుందని!
అంగడి వారికి ఎంత ఆనందమో,
వ్యాపారం రెట్టింపు అవుతుందని!
​
బడి తోటకు ఎంత వగలో,
పిల్లలు సీతాకోకచిలుకలవుతారని!
బడిగంటకు ఎంత కులుకో,
మూగనోము వీడొచ్చని!
​
గురువులకు ఎంత ముచ్చటో,
పిల్లలు పై తరగతులకు వచ్చారని!
బడికి ఎంత పరవశమో,
ఇక ప్రతి రోజూ పండుగ సందడేనని!

– సురేంద్ర రొడ్డ,
94915 23570.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్