బడి పిలుస్తోంది రా, ఓ విద్యార్థి!
కదిలి రావాలి నీవు బడి ఒడిలోకి.
సర్కారు బడి అంటే సౌకర్యాలనిధి,
చదువుతో లోకాలను ఏలే వారధి.
శిక్షణ పొందిన గురువులే అందరూ
నైపుణ్యమె ప్రాణముగా బోధన చేసేరు
పాఠాలను పాటలుగా మలిచిన తీరు
అర్థమగు రీతిలో మీకు నేర్పించగలరు
మార్కులు, ర్యాంకులు కానేకాదు లక్ష్యం
విలువలతో కూడిన విద్యే మన ధ్యేయం
మానసిక ఒత్తిడి లేకుండా నువ్వు చదవాలి
అమ్మా నాన్నల కలలను సాకారం చేయాలి
ఆర్టు, క్రాఫ్ట్, ఒకేషనల్, క్రీడల సమహారం
మానసిక ఉల్లాసాని కిది ఆలవాలం
కలెక్టరు, డాక్టరు, ఇంజనీరు లెందరో
మాబడి గర్భంలో జనించిన మహనీయులు!
– డా. కె. దామోదరాచారి,
ఆర్ట్ మాస్టర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
యాదమరి, చిత్తూరు జిల్లా.









కామెంట్‌లు (0)