test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిదేశీ ఇన్వెస్టర్ల లాభాలపై పన్ను రద్దు

04 జూన్, 2026

fpi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

 ఢిల్లీ : భారత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులపై (ఎఫ్‌పిఐ) మూలధన లాభాల పన్నును పూర్తిగా రద్దు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టాన్ని సవరించేందుకు ఒక ఆర్డినెన్స్‌ను కూడా కేబినెట్ ఆమోదించింది. ఇది రాష్ట్రపతి సంతకం తర్వాత అమలులోకి రానుంది. 2026 సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించి నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయిపై పడిన తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి, దేశంలోకి కొత్త డాలర్ల ప్రవాహాన్ని తీసుకురావడానికి ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులు 12 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచుకున్న బాండ్లపై 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుతో పాటు, వడ్డీ ఆదాయంపై 20 శాతం విత్‌హోల్డింగ్ పన్ను చెల్లిస్తున్నారు. తాజా సంస్కరణల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలలో పన్ను భారాన్ని తొలగించి, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారత రుణ మార్కెట్‌ను విదేశీయులకు మరింత ఆకర్షణీయంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మున్ముందు మరిన్ని సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్