DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదొరకని చిన్నారి జాడ

16 జూన్, 2026

doll
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- తుని (కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం హెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి జాడా ఇంకా తెలియరాలేదు. ఈ నెల 6న పామాయిల్ తోటలోకి వెళ్లి అదృశ్యమైన చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ ఎలాంటి క్లూ కూడా నేటికీ దొరక్కపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కాగా మంగళవారం పామాయిల్ తోటలో గడ్డిని తొలగించే పనులు చేపట్టారు. ఈ సమయంలో తోట చుట్టూ ఉన్న కంచెకు రెండు బొమ్మలు కట్టి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఈ బొమ్మలను తామే ఏర్పాటు చేశామని వాటిలో మాంసాన్ని ఉంచి కట్టామని పోలీసులు తెలిపారు. ఏవైనా జంతువులు ఉంటే ఈ బొమ్మల వద్దకు వచ్చే అవకాశం ఉందని భావిచి వాటిని ఏర్పాటు చేశామని తెలిపారు. సిసి కెమెరాల ద్వారా ఈ ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. చిన్నారితో పాటూ అదృశ్యమై ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన పెంపుడు కుక్క మృతి చెందిన విషయం విదితమే. పోస్టుమార్టం అనంతరం నమూనాలను విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ రిపోర్టు రావాల్సి ఉందన్నారు. డీహైడ్రేషన్ వల్ల కుక్క మృతి చెందినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. అన్ని కోణాల్లోనూ చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్‌‌పి బిందుమాధవ్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్