ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పిటిఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై లోకేష్ ఆరా తీశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జులై మూడో వారంలో మెగా పిటిఎం నిర్వహణకు సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపైనా సమావేశంలో చర్చించారు.
జులై 3వ వారంలో తల్లికి వందనం
16 జూన్, 2026
వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)