DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Road accident: దుబాయ్‌లో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం

09 జూన్, 2026

raod acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్‌: దుబాయ్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలవగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును, కార్మికులతో వెళ్తున్న మినీబస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కు అకస్మాత్తుగా ఆగడం, అదే సమయంలో మినీబస్సు డ్రైవర్ వెనుక ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన తొమ్మిది మందిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.  ఈ ఘటనపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ స్థానిక అధికారుల సహాయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్