test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంజారాహిల్స్‌లో సినీ నటికి వేధింపులు.. క్యాస్టింగ్‌ ఆర్టిస్ట్‌పై కేసు

5 గంటల క్రితం

actor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 10:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్: సినిమా అవకాశాల పేరుతో ఓ నటిని వేధించడమే కాకుండా, రావాల్సిన పారితోషికం ఇవ్వకుండా మోసం చేసిన క్యాస్టింగ్‌ ఆర్టిస్ట్‌ ప్రసాద్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో నటింపజేసినందుకు గానూ సదరు నటికి ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికం, రూ.38 వేల ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా నిందితుడు కాలయాపన చేశాడు. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌కు పిలిపించి, బకాయిలు ఇవ్వకుండా బెదిరించడమే కాకుండా.. బలవంతంగా కారులో ఎక్కించుకుని మరిన్ని అవకాశాలు ఇస్తానంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా, ఆమె నిందితుడిని ఫోన్ లో నిలదీసింది. అయితే ఆమెను సైతం నిందితుడు దుర్భాషలాడి బెదిరించడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్