test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Dominican Republic: కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఇద్దరు పైలట్లు సజీవ దహనం!

6 గంటల క్రితం

flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 08:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం

శాంటో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్‌లో ఒక ప్రైవేట్ జెట్ కుప్పకూలి ఘోర ప్రమాదం సంభవించింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి రన్‌వే సమీపంలో క్రాష్ అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడలేక లోపలే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విమానయాన శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్