వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ బి సి వారి `మీట్ ది ప్రెస్’ టెలివిజన్ ఇంటర్వ్యూ నుండి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. 2020 అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ చేసిన ఆరోపణలపై మోడరేటర్ క్రిప్టెన్ వెల్కర్ ఆధారాలు చూపించాలని కోరారు. దీంతో ట్రంప్ సమాధానమివ్వకుండా ఆగ్రహిస్తూ.. మైక్ ను విసిరిగొట్టి, మీడియా, యాంకర్ పై విరుచుకుపడ్డారు. మీడియా నిజాయితీ లేనిదని, నకిలీ, నీచమైన, వక్రబుద్ధి గల మీడియా అని, మీరు అవినీతిపరులే అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్లిపోయారు.
వివరాల ప్రకారం.. ఎన్ బి సి ఛానెల్ లో ప్రసారమయ్యే మీట్ ది ప్రెస్ కార్యక్రమం కోసం యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ ట్రంప్ ను ఇంటర్వ్యూ చేశారు. ఆయుధీకరణ నిరోధక నిధిని సమర్థిస్లూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఈ వివాదం ప్రారంభమైంది. ఇంటర్వ్యూలో ట్రంప్ 2020 ఎన్నికల్లో, కాలిఫోర్నియా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ ఆరోపించారు. నాలుగు రోజులు గడిచినా ఫలితాలు వెల్లడించలేదని, ఎన్నికల్లో మోసం జరిగిందని అన్నారు. బైడెన్ ప్రభుత్వం అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు ఆయుధీకరణ నిరోధక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధి కోసం ఒక కమిటీని నియమిస్తామని, అందులో ఎవరైనా సభ్యులుగా ఉండవచ్చని అన్నారు. అన్యాయంగా చాలా మందిని జైలుకు పంపారని, వారి జీవితాలను నాశనం చేశారని అన్నారు.
ఈ వాదనలను సమర్తించడానికి ఎటువంటి ఆధారాలు సమర్థించలేదని వెల్కర్ సవాలు చేశారు. తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే, ఆ నిధి భవిష్యత్తు గురించి ప్రశ్న అడుగుతుండగా.. ట్రంప్ అడ్డుపడ్డారు. బలమైన ఆధారాలు ఉన్నాయని, ఎన్నికల్లో మోసం జరిగిందని, అది అక్రమ ఎన్నిక అని అన్నారు. ఇప్పుడు కాలిఫోర్నియాలోనూ మళ్లీ ఇదే జరుగుతోందని అన్నారు. కాలిఫోర్నియాలో రిపబ్లికన్లు బాగా రాణిస్తున్నారని వెల్కర్ బదులిచ్చారు. ఎన్నికల్లో మోసం జరిగిందని, అది అక్రమ ఎన్నిక అని అన్నారు. ఎన్నికల అధికారులు, టెలివిజన్ నెట్ వర్క్లు, జర్నలిస్టులు నిజాయితీ పరులు కాదని ట్రంప్ ఆరోపించారు. మీట్ ది ప్రెస్ మోసపూరితమైనది, ఎబిసి, సిబిఎస్, సిఎన్ ఎన్ అన్నీ అవినీతిపరమైనవేనని, మీరు అవినీతిపరులే అంటూ మైక్రోఫోన్ ను తీసి ఇంటర్వ్యూ నుండి వెళ్లిపోయారు. ఈ ఇంటర్వ్యూ కోసం తాను విస్కాన్సిన్కు వచ్చానని ఇంటర్వ్యూ పూర్తి చేయాలని వెల్కర్ కోరారు. మీకు తగినంత సమయం ఇచ్చానని, మీరు పత్రికా రంగాన్ని సరిదిద్దు కోవాలని అక్కడి నుండి వెళ్లిపోయారు.
టెలివిజన్ ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయిన ట్రంప్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 12:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)