DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాపికొండల విహారయాత్ర నిలిపివేత

14 జూన్, 2026

Papikondalu excursion suspended
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : నేటి నుంచి పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో …. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా, జూన్ 12న, 89 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక ప్రైవేట్ పర్యాటక పడవలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది దేవిపట్నం సమీపంలో గోదావరి నది మధ్యలో నిలిచిపోయింది. ప్రయాణికులను సురక్షితంగా తరలించినప్పటికీ, అధికారులు పడవను తనిఖీ చేయడానికి వెంటనే కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీల పక్రియను ముమ్మరం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కునవరం నుండి (తెలంగాణలోని భద్రాచలం మీదుగా) పాపికొండ కొండ శ్రేణిలోకి ప్రవేశించే పడవ సేవలకు ఈ నిలుపుదల వల్ల ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్