హైదరాబాద్ నగరంలోనూ ఇళ్ల విక్రయాలు ఏప్రిల్- జూన్ సమయంలో పుంజుకున్నాయి. గతేడాది 11,815 ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఆ సంఖ్య 22 శాతం వరకు పెరిగి 14410 యూనిట్లకు చేరుకున్నాయి. ఠాణేలో 14832 యూనిట్ల నుంచి 16386 యూనిట్లకు పెరిగాయి. పుణెలో 17196 యూనిట్ల నుంచి 18737 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నైలోనూ దాదాపు 20 శాతం పెరగ్గా 6323 ఇళ్లు అమ్ముడుబోయాయి. ఇక ఢిల్లీ- NCR, కోల్‌కతాల్లో విక్రయాలు తగ్గాయి. ఇక్కడ వరుసగా హౌసింగ్ సేల్స్ 10082, 3414 యూనిట్లుగా ఉన్నాయి.