test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవంతంగా సూర్యాస్త్ర ప్రయోగం !

21 మే, 2026

rocket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 21, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : సుదూర లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగల సూర్యాస్త్ర రాకెట్‌ ‌వ్యవస్థలను భారత్‌‌ బుధవారం విజయవంతంగా చాందిపూర్‌‌లోని ఇంటిగ్రేటెడ్‌ ‌టెస్ట్‌ ‌రేంజ్‌ ‌నుండి పరీక్షించింది. దీంతో దేశీయ రక్షణ రంగ సామర్ద్యాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ ‌ఒక అడుగు ముందుకు వేసింది. శతృ స్థావరాలు, కమాండ్‌ సెంటర్లు, రాడార్లు, శతృ దేశాల్లోని లాజస్టిక్స్‌ హబ్‌‌లపై ప్రయోగించడానికి వీలుగా రూపొందించిన దీర్ఘ శ్రేణి గైడెడ్‌ ‌రాకెట్‌ ఆర్టిలరీ వ్యవస్థ ఇది. ప్రైవేటు రంగ రక్షణ సంస్థ అయిన నిబె లిమిటెడ్‌ ఈ పరీక్షను నిర్వహించింది. 150కి.మీ, 350కి.మీ పరిధుల్లోని లక్ష్యాలను ఛేదించగల సూర్యాస్త్ర రాకెట్‌ ‌వ్యవస్థలకు సంబంధించిన రెండు వేరియంట్లను ఈ కంపెనీ పరీక్షించింది. రెండు రాకెట్‌‌లు కూడా అత్యంత కచ్చితత్వంతో లక్ష్య ఛేదన చేశాయని అధికారులు తెలిపారు. భారత సైన్యం ఈ రాకెట్ల కోసం ఆర్డర్‌ ‌చేసిన నేపథ్యంలో విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించి వాటి సామర్ద్యాలను అంచనా వేశారు. దీంతో అధునాతన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ప్రైవేటు భారతీయ సంస్థల పట్ల విశ్వాసం పెరుగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్