test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమనసులో మిగలాలి

17 మే, 2026

మనసులో మిగలాలి ​
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 07:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మొదలు చివర తెలియని జీవితం

సాగుతున్నంతకాలం ఓ తెల్లకాగితం

ముందుముందుకు సాగిపోతున్నానని

నడిచే కాలం ఎప్పుడూ ఎవరికీ చెప్పదు

ఎవరికి ఏమి ఎలా ఇవ్వాలో తెలుసునేమో

మౌనంగా తనపని తాను చేసుకు వెళ్తుంది

ఎదిగిన వృక్షం ఆకులు నేల రాలి

కాలగతిలో మోడువారక తప్పదు నీడనో,

ఆశ్రయాన్నో, ఫలాలో ఇవ్వగలిగానని

చివరిదశలో తాను సంతృప్తినే వ్యక్తం చేస్తుంది

ఋతువులు వస్తూ పోతూ ఉంటాయి

తమధర్మం చివరివరకూ తాము నిర్వర్తిస్తూ

ప్రకృతి ఇవ్వగలిగేది ఇస్తూనే ఉంటుంది

ఏ జీవరాశికైనా పొందే భాగ్యం ఉంటుంది

వచ్చేటప్పుడు_ ఏదీ వెంట తీసుకురాని మనిషి

పోయేటప్పుడు_ వెంట ఏమీ తీసుకెళ్ళడు

చివరివరకూ మనిషిగా వెళ్ళగలిగితేనే_

అందరి మనసులో మిగిలిపోగలడు

​​

డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి

9849331554

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్