test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమిగిలిన దారం

17 మే, 2026

మిగిలిన దారం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 07:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గాలిపటానికి

గాలినెదిరించే ధైర్యం

దారమే ఇస్తుంది

దారమదుపులో వున్నంతవరకే

గాలిపటం గాలినెదురిస్తూ

ఉన్నత శిఖరాలకెగురుతుంది

దారబంధాన్ని

తెంచుకున్న గాలిపటాన్ని

గాలిలోకి తోసేసి

గాలిలో కలిపేస్తుంది గాలి

స్వేచ్ఛ పేరుతో కొన్ని గాలిపటాలు

తెలియని కోపంతో‌

మరికొన్ని గాలిపటాలు

దారపు ప్రేమ బంధాన్ని తెంచుకుని

ఎగిరిపోతాయి

చేతిలో మిగిలిన దారం

గాలిపటం ఆచూకీ తెలియక

వెక్కి వెక్కి ఏడుస్తుంది

చిత్తలూరి

9133832246


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్