మనిషిది చెట్టుది_
విడదీయని బంధం,
మొక్కను నాటి
చెట్టులా ఎదగనిస్తే చాలు
మనిషికి ఎనలేని సాయం చేస్తుంది!
ఊగడానికి ఊయలగా
బతకడానికి ప్రాణవాయువుగా
ఆకలికి తీర్చడానికి పళ్ళుగా
అలసిన వేళలో నీడగా
ఇంటికి భద్రతగా
రోగాలకు మందుగా_
వృద్ధులకు చేతికర్రగా_
చివరికి చితిగా మారుతుంది!
సాటి మనిషికి సాయం చేస్తే_
మేలు చేస్తాడన్న నమ్మకం లేదు,
మొక్కకు నీళ్ళు పోస్తే మాత్రం
చెట్టుగా మారి ఎల్లకాలం తోడుంటుంది,
అటువంటి చెట్టును కాపాడుకోవాలి
చెట్టుతో అనుబంధాన్ని పెంచుకోవాలి_
నరుక్కోవొద్దు, తుంచుకోవద్దు!
వి. పునీత్ కుమార్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుత్బుల్లాపూర్,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.








కామెంట్‌లు (0)