test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆదుకున్న ప్రభ్ సిమ్రన్, ఒమర్జాయ్

14 మే, 2026

ipl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 01:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పంజాబ్ కింగ్స్ 200/8

– బుమ్రాకు ముంబయి పగ్గాలు

– శార్దూల్ కు నాలుగు వికెట్లు

ధర్మశాల: పంజాబ్ కింగ్స్ జట్టు ముంబయి ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57) అర్ధ సెంచరీకి తోడు చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ముంబయి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయికి పంజాబ్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, ప్రభ్‌సిమ్రన్ ఔటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో శ్రేయస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. దీంతో పంజాబ్ 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. అతనికి తోడుగా విష్ణు వినోద్ (15*), జేవియర్ బార్ట్‌లెట్ (18*) కూడా చివరి ఓవర్లలో విలువైన పరుగులు జోడించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 200 పరుగుల మార్కును అందుకుంది. ముంబయి బౌలర్లలో శార్దూల్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశారు. బుమ్రాకు కెప్టెన్సీ… ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా జస్ర్పీత్ బ్రుమా వ్యవహరించాడు. వ్యక్తిగత కారణాలతో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని, హార్దిక్ పాండ్యా గురించి ఎలాంటి సమాచారం లేదని దీంతో తాను కెప్టెన్ గా వ్యవహరించాల్సి వచ్చిందని టాస్ అనంతరం మాట్లాడుతూ బుమ్రా తెలిపాడు. కెప్టెన్సీ హోదాలో తొలిసారి మైదానంలోకి వచ్చిన బుమ్రా.. టాస్ గెలిచి తొలిగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. యాజమాన్యం తనపై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం గౌరవంగా భావిస్తానని అన్నాడు.


స్కోర్ బోర్డు…

పంజాబ్ కింగ్స్ : ప్రియాన్ష్ ఆర్యా (బి)దీపక్ చాహర్ 22, ప్రభ్ సిమ్రన్ సింగ్ (సి)బోట్చ్ (బి)శార్దూల్ ఠాకూర్ 57, కూపర్ కనోలే (బి)రాజ్ బవా 21, శ్రేయస్ అయ్యర్ (బి)శార్దూల్ ఠాకూర్ 4, సుయాన్ష్ షిండే (సి)రాజ్ బవా (బి)శార్దూల్ ఠాకూర్ 8, శశాంక్ సింగ్ (ఎల్ బి)బోట్చ్ 2, ఒమర్జాయ్ (సి)విల్ జాక్స్ (బి)దీపక్ చాహర్ 38, యాన్సెన్ (బి)శార్దూల్ ఠాకూర్ 2, విష్ణు వినోద్ (నాటౌట్) 15, బార్ట్ లెట్ (నాటౌట్) 18, అదనం 13. వికెట్ల పతనం: 1/50, 2/107, 3/111, 4/111, 5/123, 6/135, 7/140, 8/166 బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-36-2, బుమ్రా 4-0-35-0, శార్దూల్ ఠాకూర్ 4-0-39-4, బోట్చ్ 4-0-42-1, రఘు శర్మ 2-0-22-0, విల్ జాక్స్ 1-0-9-0, రాజ్ బవా 1-0-11-1.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్