test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionFrench Open: డయానా సంచలనం

4 రోజుల క్రితం

Diana.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 11:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంక పై గెలుపు

  • ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ లో పెను సంచలనం నమోదైంది. పురుషుల, మహిళల సింగిల్స్ టాప్ క్లాస్ షట్లర్లంతా ఓటమిపాలైనా.. టాప్ సీడ్ సబలెంక తన ఫామ్ ను కొనసాగిస్తూ క్వార్టర్స్ కు చేరింది. కానీ క్వార్టర్ ఫైనల్లో 25వ సీడ్, రష్యా కు చెందిన డయానా షణైదర్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తొలి సెట్ ను సునాయాసంగా గెలిచిన సబలెంక.. ఆ తర్వాత రెండు సెట్ లలో షణైదర్ అద్భుతంగా పుంజుకొని సబలెంక జోరుకు బ్రేక్ వేసింది. దీంతో మూడుసెట్ల హోరా హోరీ పోరులో డయానా షణైదర్ 3-6, 7-5, 6-0తో సబలెంకను ఓడించి సెమీస్ కు చేరింది. షణైదర్ ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీస్ కు చేరడం ఇదే తొలిసారి. మరో క్వార్టర్ ఫైనల్లో అన్ సీడెడ్, పోలండ్ కు చెందిన చ్వాలిన్కా వరుససెట్లలో 22వ సీడ్ కలిన్స్కయా ను చిత్తు చేసింది. హోరా హోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ఛ్వాలిన్స్కా 7-6(7-3), 6-3తో కలిన్స్కయా(రష్యా)ను ఓడించింది. గురువారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ జరగనున్నాయి.

ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి 26వ సీడ్ మెన్సిక్(చెక్ రిపబ్లిక్) ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో మెన్సిక్ 6-4, 6-2, 7-6(7-3)తో 28వ సీడ్, బ్రెజిల్ కు చెందిన ఫోన్సెకాను ఓడించాడు. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్లో మెన్సిక్ 2వ సీడ్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ తో తలపడనున్నాడు. ఇక పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్ కు చెందిన శ్రీరామ్ బాలాజీ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్ లో బాలాజీ-డెమోలినర్(బ్రెజిల్) జంట 3-6, 4-6తో 2వ సీడ్, పాటెన్(బ్రిటన్)-హెలియోవారా(ఫిన్లాండ్) చేతిలో ఓటమిపాలయ్యారు.

మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్…

కోస్ట్కూక్(15)  × ఆండ్రీవా(8) (రా.6.30గం||లకు)

చ్వాలిన్స్కా × డయానా షణైదర్(25) (రా.7.40గం||లకు)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్