ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ
నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి 8వ సీడ్, రష్యాకు చెందిన 19ఏళ్ల మిర్రా ఆండ్రీవా ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆండ్రీవా వరుససెట్లలో 15వ సీడ్, ఉక్రెయిన్ కు చెందిన కోస్ట్యూక్ ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో ఆండ్రీవా జోరు ముందు కోస్ట్యూక్ నిలువలేకపోయింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆండ్రీవా 6-1, 6-3తో మర్టా కోస్ట్యూక్ ను ఓడించి తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ కు చేరింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం 76 నిమిషాల్లోనే ముగిసింది. అలాగే కోస్ట్యూక్ వరుసగా 17 మ్యాచ్ ల వరుస విజయాలకు ఆండ్రీవా బ్రేక్ వేసింది. గ్రాండ్ స్లామ్ టోర్నీల చరిత్రలో 19ఏళ్లకే ఫైనల్ కు చేరిన మూడో యువ క్రీడాకారిణిగా ఆండ్రీవా రికార్డుల్లో కెక్కింది. ఇంతకుముందు అమెరికాకు చెందిన కోకో గాఫ్ 18ఏళ్లకు, 2022లో, కిమ్ క్లిస్టర్స్ 2001లో 17ఏళ్ల రొలాండ్ గారోస్ ఫైనల్ కు చేరి రికార్డుల్లో కెక్కారు. వారిద్దరి తర్వాత మిర్రా ఆండ్రీవా 19ఏళ్లకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరింది. టాప్ సీడ్, బెలారస్ కు చెందిన అర్యానా సబలెంకా క్వార్టర్ ఫైనల్లో ఓటమితో ఫైనల్ కు చేరి అత్యధిక ర్యాంక్ క్రీడాకారిణి ఆండ్రీవా మాత్రమే. ఆమె ప్రస్తుతం ఎటిపి ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో ఉంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య టెన్నిస్ పోటీ ప్రాధాన్యత సంతరించుకుంది.








కామెంట్‌లు (0)