ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రజత్ పటిదార్ (Rajat Patidar) సారథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ సీజన్ అవార్డుల వేడుకలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ అవార్డుల వేడుకలో అద్భుత ప్రదర్శనతో ఏకంగా ఐదు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
వైభవ్ సాధించిన అవార్డులు:
ఆరెంజ్ క్యాప్: ఈ సీజన్‌లో అత్యధికంగా 776 పరుగులు సాధించాడు.
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): 436.5 పాయింట్లతో ఈ అవార్డును దక్కించుకున్నాడు.
మోస్ట్ సిక్సెస్: సీజన్‌లో అత్యధికంగా 72 సిక్సర్లు బాదాడు.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: ఈ అవార్డుతో పాటు రూ.40 లక్షల ప్రైజ్ మనీ మరియు టాటా సియెర్రా కారును బహుమతిగా పొందాడు.








కామెంట్‌లు (0)