test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాహులయ్యా!

4 రోజుల క్రితం

rahul gandi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పల్లవి: అయ్యా రాహులూ!

అయ్యయ్యో రాహులు

దాచేస్తే దాగదు..మీ

మతోన్మాద మాయ మహలు

అయ్యా రాహులూ!

అయ్యయ్యో రాహులో!

చరణం: సొంత బుర్ర వాడితే

కొంత పైకి వస్తావు..

వంతగాళ్ల తొత్తయితే

సంతలో సరుకవుతావు..

స్టేటుకొక్క స్టేట్మెంటు

స్టేటసే పోయింది ..

పార్టీకే పనిష్మెంట్

బక్క చిక్కిపోయింది..

సర్కస్ లో జోకరే

అతని కన్న నయమురా!

ఆ అడ్డదిడ్డ నడక- అందరికీ

అయోమయమురో!

అయ్యా రాహులూ-

అయ్యయ్యో రాహులూ

చరణం: నేషనల్ హెరాల్డూ

స్కాము అతని టీ షర్టు..

విప్పి చూస్తే బోఫోర్స్

వీపు మీద పుట్టుమచ్చ..

ఊబిలోన దిగిపోయి

ఊపిరాడకుందేమో!

బయటపడే దారులను

బతుకు వెతుకుతుందేమో!?

పార్లమెంటులోనా

కామెడీ కౌగిలింత!

మోడీ-షా పెరడులోనా

ట్రాజెడీ ఆవలింత!?

అయ్యా రాహులూ!

అయ్యయ్యో రాహులూ!!

చరణం: ప్రపంచ చరిత్రలో

ప్రజలు ఎన్నుకున్న..

తొలి కమ్యూనిస్టుల

ప్రభుత్వాన్ని కూల్చేసినా..

ఉద్యమ చైతన్యమే

నైరుతి పవనాల నిండా!

కేరళం తీరంలో

శిరసెత్తెను ఎర్ర జెండా!

ఆ ఒక్క పేజీ చదువు..

నాయనమ్మ డైరీలో!

ఒళ్ళు జలదరిస్తదీ--నీ

కళ్ళను తెరిపిస్తది!

ఒళ్ళు జలదరిస్తది..నీ

కళ్ళను తెరిపిస్తది..

సుత్తీ కొడవలి నీకు

సుక్కలు సూపిస్తది!

సుక్కలు సూపిస్తదీ..

దిక్కులు సూపిస్తదీ!

సుక్కలు సూపిస్తది..

రానున్న కాలంలో

రక్తం గక్కిస్తదో!


-- నల్లి ధర్మారావు

76609 67313

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్