test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

CJP: అభిజీత్ దీప్కే పై దాడి

4 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 07:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జైపూర్: జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దుండగులు దాడి చేశారు. ఈ రోజు జైపూర్‌లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన అభిజిత్‌ దీప్కేను పార్టీ మద్దతుదారులు భుజాలపై ఎత్తుకుని ర్యాలీగా సభా ప్రాంగణానికి తీసుకెళ్తున్న సమయంలో దుండగులు దాడికి పాల్పడ్డారు.  ఈ ఘటన సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఆయన వద్దకు చేరుకుని దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనతో అక్కడ గందరగోళం నెలకొనగా, కొందరు మద్దతుదారులు దాడి చేసిన వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో అభిజిత్‌ దీప్కే స్వయంగా జోక్యం చేసుకుని, దాడి చేసిన వ్యక్తిపై ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. నీట్‌, సీబీఎస్‌ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారిని చట్టపరంగా శిక్షించాలని సిజెపి డిమాండ్‌ చేస్తోంది. ఈ ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలను హింస ద్వారా అణచివేయాలనే ప్రమాదకర ధోరణిని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చిందని సీజేపీ కార్యకర్తలు పేర్కొన్నారు. రాజకీయ లేదా సామాజిక విభేదాలు ఉన్నప్పటికీ, వాటిని చర్చలు, వాదోపవాదాల ద్వారానే పరిష్కరించాలి గానీ భౌతిక దాడులకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. సంఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్