test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరవై ఏళ్ల మనసు

27 మే, 2026

అరవై ఏళ్ల మనసు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 01:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అరవై ఏళ్లు వచ్చాయని

అస్తమయం అయిపోయిందనకు…

కాలం గీసిన ముడతల్లో

అనుభవాల వెలుగు దాగి ఉంటుంది.


నడిచిన దారులు చెబుతాయి —

పడిపోయినా లేచిన కథలు,

కన్నీటి వెనుక నిలిచిన

నవ్వుల అసలైన అర్థాలు.


యవ్వనం వేగంగా పరిగెడితే,

వృద్ధాప్యం నెమ్మదిగా నేర్పుతుంది…

జీవితం అంటే వయసు కాదు,

మనసు ఇంకా కలలు కనడమే అని.


ఇప్పుడే మొదలు రెండో ప్రయాణం,

ఇప్పుడే మనసుకు నిజమైన స్వేచ్ఛ…

అరవై ఒక సంఖ్య మాత్రమే,

ఆత్మకు వయసే ఉండదు కదా!


– రాజాబాబు కంచర్ల

9490099231

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్