test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేనెవరిని?

31 మే, 2026

kids 2.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ‌పిల్లలూ,

ఎండలో బయట తిరుగుతూ, అల్లరి పనులు చేస్తూ, సరిగ్గా భోజనాలు చేయక తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారా! అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మీరంతా ఒక దగ్గర కూర్చోని కొన్ని గణిత చిట్కాలు, గణిత చమత్కారాలు నేర్చుకోండి. ఈ రోజు మెదడుకు మేత లాంటి ఈ ప్రశ్నను సాధన చేయండి.

*నేను 8 అంకెల సంఖ్యను.

*నేను సరి సంఖ్యను.

*నేను సరి సంఖ్యతో ప్రారంభమవుతాను.

*సరి సంఖ్యతో అంతమవుతాను.

*నాలో రెండు ఒకట్లు, రెండు రెండ్లు, రెండు మూడులు, రెండు నాలుగులు ఉన్నాయి.

*నాలో ఈ ఎనిమిది అంకెలు ఏ విధంగా ఉన్నాయి అంటే.. రెండు ఒకట్లు మధ్య ఒక అంకెను, రెండు రెళ్ళు మధ్యలో రెండు అంకెలు, రెండు మూడుల మధ్య మూడు అంకెలు, రెండు నాలుగులు మధ్య నాలుగు అంకెలతో ఇమిడి యున్నాను. అయితే నేను ఎవరిని?

నా సంఖ్య రూపం ఎలా ఉంటుందో కనుక్కోండి చూద్దాం?

* జవాబు: ఇచ్చిన సంఖ్యలు 1,1,2,2,3,3,4,4

*సంఖ్యా రూపం : 41312432


- మడ్డు తిరుపతి రావు,

గణిత అవధాని & టీచరు,

బూరగాం కంచిలి*శ్రీకాకుళం,

94913 26473.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్