test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లండన్‌లో పల్నాడు యువకుడు మృతి

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 11:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -సత్తెనపల్లి రూరల్ : పల్నాడు జిల్లాకు చెందిన యువకుడు లండన్‌‌లో మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు...సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన గంగా వెంకటరావు, అనురాధ దంపతుల కుమారుడైన శివకోటేశ్వరరావు (26) బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువులు కోసం గతేడాది లండన్‌ ‌వెళ్లారు. బిపిపి యూనివర్సిటీలో ఎంఎస్‌ ‌చేస్తూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో గతనెల 13న ఉద్యోగ విధులు ముగించుకుని స్థానిక రైలులో ఇంటికి వెళ్తుండగా జారిపడి మృతి చెందారు. మే 18న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి స్నేహితులు ద్వారా మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లండన్‌‌లోని తెలుగు సంఘాల వారు లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని ఇండియాకు పంపించారు. సోమవారం లక్క రాజుగార్లపాడులో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి తల్లి దండ్రులతోపాటు వివాహమైన సోదరి ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్