DRISHYAM
సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

02 జూన్, 2026

bus acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 40 మందికి గాయాలు

సూరత్: గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా బర్డోలీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది.  మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఒక బస్సు బర్డోలీ వద్ద ట్రాక్టర్‌ను తప్పించబోయి, అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. . ఈ బస్సులు పరస్పరం ఢీకొట్టుకోవడంతో ఒక బస్సులో మంటలు చెలరేగాయన్నారు. ఈ బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు బర్డోలీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని తీవ్ర విచారం

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్