పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి 2వ సీడ్, జర్మనీకి చెందిన ఆండీ జ్వెరేవ్ ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో జ్వెరేవ్ 7-5, 6-2, 3-6, 6-3తో 26వ సీడ్, చెక్ రిపబ్లిక్ కు చెందిన మెన్సిక్ ను ఓడించాడు. తొలి సెట్ ను చేజిక్కించుకొనేందుకు పోరాడిన జ్వెరేవ్.. రెండో సెట్ ను సునాయాసంగానే గెలిచాడు. కానీ మూడో సెట్ లో అనూహ్యంగా మెన్సిక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో ఆ సెట్ ను చేజార్చుకున్న జ్వెరేవ్.. నాల్గో సెట్ ను సునాయాసంగా గెలిచి మ్యాచ్ ను ముగించాడు. దీంతో 2024 తర్వాత మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరాడు. 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరినా.. ఆ ఏడాది స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓడాడు. జ్వెరేవ్ ఇప్పటివరకు మూడు గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ కు చేరినా.. రన్నరప్ తోనే సరిపుచ్చు కున్నాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఫైనల్ కు చేరిన జ్వెరేవ్ ఈసారి టైటిల్ కొట్టడం ఖాయం కనబడుతోంది. ఎందుకంటే ఈసారి టాప్ సీడ్ క్రీడాకారులంతా ఇప్పటికే నిష్క్రమించిన దశలో.. ఫైనల్ కు చేరిన జ్వెరేవ్ కెరీర్ తొలి గ్రాండ్ స్లామ్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు క్వాలిఫయర్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ కు పోలండ్ కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి మజా చ్వావిలిన్స్కా ప్రవేశించింది. టోర్నీ చరిత్రలో ఒక క్వాలిఫయర్ ఫైనల్ కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 2014లో రష్యాకు చెందిన షరపోవా అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకొని రికార్డుపుటల్లోకెక్కింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో చ్వావిలిన్స్క రష్యాకు చెందిన 25వ సీడ్ క్రీడాకారిణి డయానా షిణైదర్ను 7-6(7-4), 6-4తో ఓడించి ఫైనల్‌కు చేరింది. ఇక 24ఏళ్ల ఛ్వావిలిన్స్కా ఫైనల్లో గెలిస్తే క్వాలిఫై టోర్నీ ద్వారా గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించి 2021 ఫైనల్ కు చేరిన రాదుకాను సరసన చేరనుంది. ఇక పురుషుల, మహిళల సింగిల్స్ లో 1968 తర్వాత క్వాలిఫై టోర్నీ ద్వారా ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీకి తుది పోరుకు చేరింది వీరిద్దరు మాత్రమే. శనివారం జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో చ్వావిలిన్స్కా రష్యా కు చెందిన 8వ ర్యాంకర్ మిర్రా ఆండ్రీవాతో తలపడనుంది.








కామెంట్లు (0)