2026 ఫిఫా వరల్డ్ కప్‌లో జాత్యహంకార (రేసిజం) వివాదం చెలరేగింది. లైవ్ టీవీలో ఒక మ్యాచ్ అధికారి వివాదాస్పద చేతి గుర్తును ప్రదర్శించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ అధికారిని తక్షణమే వరల్డ్ కప్ విధుల నుంచి తొలగించాలని ఫిఫా వివక్ష నిరోధక పర్యవేక్షక సంస్థ డిమాండ్ చేసింది. ఆదివారం హ్యూస్టన్ వేదికగా జర్మనీ, కురాకో జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు బ్రాడ్‌కాస్టర్లు వీడియో రివ్యూ అనలిస్టుల బృందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన వీడియో అధికారి షాన్ ఎవాన్స్ తన కుడి చేతితో ‘ఓకే’ (OK) గుర్తును తలకిందులుగా చూపిస్తూ కెమెరాకు చిక్కాడు. డల్లాస్‌లోని వరల్డ్ కప్ బ్రాడ్‌కాస్ట్ సెంటర్ నుంచి ఆయన ఈ మ్యాచ్‌కు పనిచేశారు. ఈ తలకిందుల ‘ఓకే’ గుర్తును శ్వేత జాతీయ అహంకారానికి, ఫార్-రైట్ భావజాలానికి ప్రతీకగా పరిగణిస్తారు. 2019లో న్యూయార్క్‌కు చెందిన యాంటీ-డిఫమేషన్ లీగ్ కూడా దీనిని 'ద్వేషపూరిత చిహ్నం`గా ప్రకటించింది. ఈ ఘటనపై ఫిఫా భాగస్వామ్య సంస్థ అయిన ‘ఫేర్ నెట్‌వర్క్’ తీవ్రంగా స్పందించింది. ఇదొక ‘నియో-నాజీ’ సంకేతమని, ప్రపంచం మొత్తం చూస్తున్న సమయంలో కెమెరా ముందు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి గుర్తును ప్రదర్శించిన సదరు అధికారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.
జాత్యహంకార వివాదం
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 01:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)