తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా గెలుపు
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదింపు
• 51 బంతుల్లో సెంచరీ బాదిన గుర్బాజ్
ధర్మశాల: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలి గా బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు 24.5ఓవర్లలో 194పరుగులకు కుప్పకూలింది. అనంతరం భారతజట్టు 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించగా, కేఎల్ రాహుల్ (39 నాటౌట్) తన మెరుపు బ్యాటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మంచి ఆరంభం లభించింది. రోహిత్ శర్మ (16) వేగంగా ఆడి రనౌటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (34) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒకవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడి, 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి, మరో 13 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు, టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా, ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (102) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో శతకాన్ని నమోదు చేశాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) రాణించగా.. గుర్బాజ్ ఔటయ్యాక అఫ్గాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో యువ ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేకు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డిలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్ మన్ గిల్ కు దక్కింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది._
స్కోర్ బోర్డు…
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి)నితీశ్ రెడ్డి 102, ఇబ్రహీం జడ్రాన్ (సి)గిల్ (బి)గుర్నూర్ 1, సెద్ధిఖుల్లా (ఎల్ బి)ఆర్ష్ దీప్ 0, రామత్ షా (సి)హర్ష్ దూబే (సి)ఆర్ష్ దీప్ 3, హస్మతుల్లా షాహిదీ (సి)కెఎల్ రాహ్ు (బి)హర్ష్ దూబే 27, అజ్మతుల్లా ఒమర్జాయ్ (స్టంప్)ఇషాన్ (బి)హర్ష్ దూబే 26, మహ్మద్ నబీ (సి)ఆర్ష్ దీప్ (బి)నితీవ్ రెడ్డి 9, రషీద్ ఖాన్ (బి)గుర్నూర్ బ్రార్ 9, ఘజన్ ఫర్ (సి)గిల్ (బి)హర్ష్ దూబే 0, రహ్మాన్ షారిఫి (సి)ఆర్ష్ దీప్ (బి)గుర్నూర్ బ్రార్ 4, సలీమ్ (నాటౌట్) 1, అదనం 12. (24.5ఓవర్లలో ఆలౌట్) 194పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/16, 3/26, 4/142, 5/144, 6/172, 7/182, 8/182, 9/193, 10/194
బౌలింగ్: ఆర్ష్ దీప్ 5-0-27-2, గుర్నూర్ బ్రార్ 4.5-0-27-3, ప్రసిధ్ కృష్ణ 5-0-35-0, హర్ష్ దూబే 5-0-47-3, సుందర్ 1-0-19-0, నితీశ్ కుమార్ 4-0-31-2.
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్)రషీద్ ఖాన్ /గుర్బాజ్ 16, గిల్ (నాటౌట్) 84, ఇషాన్ కిషన్ (బి)రషీద్ ఖాన్ 34, శ్రేయస్ అయ్యర్ (సి)సలీమ్ సఫీ (బి)రామన్ షరీఫీ 12, కెఎల్ రాహుల్ (నాటౌట్) 39, అదనం 10. (22.5ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 195పరుగులు.
వికెట్ల పతనం: 1/46, 2/116, 3/142
బౌలింగ్: ఇమర్జాయ్ 3.5-0-41-0, రహమాన్ షరీఫీ 4-0-39-0, ఘజన్ ఫర్ 5-0-28-0, సలీమ్ షఫీ 3-0-23-0, రషీద్ ఖాన్5-0-37-1, మహ్మద్ నబీ 2-0-26-0.







కామెంట్లు (0)