test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టాలు తప్పిన ఉజ్జయిన్ ఎక్స్‌ప్రెస్

19 మే, 2026

train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం


రిషికేశ్‌: ఉత్తరాఖండ్ లోని రిషికేశ్‌లో యోగనగరి రైల్వే స్టేషన్ సమీపంలోని ఖండ్‌గావ్ ప్రాంతంలో ఉజ్జయిన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో రైలును రైల్వే యార్డుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటికే రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు ఇండోర్‌లోని లక్ష్మీబాయి నగర్ నుంచి రిషికేశ్ యోగనగరి వరకు నడుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, షంటింగ్ లైన్ చివర ఉన్న డెడ్ ఎండ్ బఫర్‌ను ఇంజిన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఢీకొన్న ప్రభావంతో బోగీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి, ఒక బోగీ పట్టాల నుంచి పక్కకు జారిపోగా, మరో బోగీ మధ్యలోనే కూలిపోయింది. మొత్తం మూడు బోగీలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటీవలి కాలంలో దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బీహార్ లోని ససారం రైల్వే స్టేషన్ వద్ద తిరువనంతపురం నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ మరియు ఒక ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. రైళ్లు పట్టాలు తప్పడం, అగ్నిప్రమాదాలు వంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో భారత రైల్వే భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యవస్థలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్